Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిషిత్ కారు ప్రమాదాన్ని వీడియో తీసిన వ్యక్తి.. మీడియాకు అమ్మేందుకు యత్నాలు

ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను అమ్మేందుకు మీడియా సంస్థలకు ఫోన్ చేస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల

నిషిత్ కారు ప్రమాదాన్ని వీడియో తీసిన వ్యక్తి.. మీడియాకు అమ్మేందుకు యత్నాలు
, శుక్రవారం, 12 మే 2017 (09:11 IST)
ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను అమ్మేందుకు మీడియా సంస్థలకు ఫోన్ చేస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కారు మెట్రోరైల్ పిల్లర్‌ను ఢీకొన్న విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నిషిత్, అతని స్నేహితుడు రాజా రవిచంద్రలు దుర్మరణం పాలయ్యారు. 
 
అయితే, ఈ ప్రమాద దృశ్యాలను యాదృచ్ఛికంగా ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇదే తరహాలో చిత్రీకరించారు. ‘ఆ వీడియో నా దగ్గర ఉన్నది కొంటారా’ అంటూ ఓ వార్తా సంస్థకు ఫోన్ చేసిన బేరసారాలకు దిగాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరటి చెట్టుతో నిషిత్ వివాహం... 'ఏం చేస్తాం.. మన చేతిలో లేనిది'.. అంటూ మంత్రి నారాయణ