Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

మంత్రి నారాయణను అవమానించిన టిడిపి నేతలు.. ఎందుకు?

పురపాలక అర్బన్ హౌసింగ్ మంత్రి నారాయణకు తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా చిత్తూరుకు రెండు సంవత్సరాలు వున్న నారాయణతో అన్ని పనులు చేయించుకున్న నాయకులు, అధికారులు సైతం ఆయన గురించి పట్టించుకోనేలేదు. దీంతో తిరుపతిలోని అధికారులు, న

Advertiesment
AP Minister
, శుక్రవారం, 10 నవంబరు 2017 (17:50 IST)
పురపాలక అర్బన్ హౌసింగ్ మంత్రి నారాయణకు తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా చిత్తూరుకు రెండు సంవత్సరాలు వున్న నారాయణతో అన్ని పనులు చేయించుకున్న నాయకులు, అధికారులు సైతం ఆయన గురించి పట్టించుకోనేలేదు. దీంతో తిరుపతిలోని అధికారులు, నాయకుల మీద నారాయణ అనుచరులు ఆగ్రహంగా వున్నారు.
 
చిత్తూరు జిల్లా ఇన్‌చార్జీగా రెండు సంవత్సరాల పాటు పనిచేసిన పురపాలక శాఖ మంత్రి నారాయణ తిరుపతి నగరానికి ఎనలేని సేవ చేసారు. అత్యధికంగా నిధులు ఈ ప్రాంతానికి మంత్రి ఖర్చు చేశారు. సిఎం తిరుపతి అభివృద్ది మీద ప్రత్యేక శ్రద్ధ చూపడంతో నారాయణ మరింత శ్రద్ధతో అభివృద్దికి బాటలు వేసాడు. ముఖ్యంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభల పేరుతో తిరుపతి నగరానికి ఏకంగా 170 కోట్లు విడుదల చేసి రోడ్లను తీర్చిదిద్దారు. 
 
దీంతో పాటు కాంగ్రెస్ పాలనలో నిధులు లేక నిలిచిపోయిన సుమారు 2 వేల ఇళ్ళను త్వరితగతిన పూర్తిచేయడానికి ప్రత్యేకంగా సిఎంకు చెప్పి నిధులు కేటాయించారు. నిధులు కేటాయించడమే కాకుండా ప్రతివారం వచ్చి వారి నిర్మాణ పనులపై రివ్యూ నిర్వహించేవారు. దీంతో పాటు నగరంలో అంగన్‌వాడీలను అత్యాధునికంగా తీర్చిదిద్దాడానికి తిరుపతి నుంచే శ్రీకారం చుట్టారు. తన శాఖలో ప్రతి ఒక్క పనిని ఇక్కడ నుంచి ప్రారంబించాడు. వారంలో ఓ రోజు తిరుపతికి ఆయన కేటాయించేవారు.
 
అయితే జిల్లా గ్రూపు రాజకీయాల విషయంలో ఆయన కఠినంగా వ్యవహారించలేదని వార్తలు రావడంతో పాటు అయన పేరు చెప్పుకుని కొంతమంది తప్పుడు పనులు చేస్తున్నారని మంత్రికి తెలిసింది. నారాయణ ఎంఎల్సి అభ్యర్థిగా నిలబెట్టిన సమీప బంధువు ఓడిపోవడంతో అందుకు కారణం చిత్తూరుకు చెందిన కొంతమంది నాయకులు వుండటంతో అయన చిత్తూరు ఇన్‌చార్జీ బాద్యతల నుంచి తప్పుకున్నారు. అయినప్పటికి ఆయన అర్బన్ హౌసింగ్ స్కీమ్ విషయంలో సీరియస్‌గా పనులు చేయించారు. దీంతో ఇప్పటికే సుమారు మూడువేల గృహ సముదాయాలను రెండు విడతలుగా సిఎం ప్రారంభించారు.
 
ఇక్కడివరకు బాగానే వున్న అసలు విషయం ఏంటంటే తనపల్లిలో సిఎం గృహ సముదాయాలను ప్రారంభించినప్పుడు నారాయణకు చేదు అనుభవం ఎదురయింది. గృహ నిర్మాణ సముదాయం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. దీనితో పెద్దఎత్తున స్థానిక నాయకులు ప్లెక్సీలు వేసారు. ఒక్క ప్లేక్సీలో కూడా నారాయణ చిత్రం కనిపించలేదు. దీంతో పాటు అర్బన్ హౌసింగ్ శాఖతో పాటు నగరపాలక సంస్థ కూడా వేయించిన ప్లేక్సీలో కూడా నారాయణ చిత్రం కనిపించలేదు. వీటిని చూసి నారాయణకు సంబంధించిన అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.
 
పలుమార్లు ఈ ప్రాంతంలో మంత్రిగారు పర్యటించి నిర్మాణం పూర్తి కావడానికి కృషి చేసారని అయితే తిరుపతి ఎంఎల్ఎ కాని స్థానిక నాయకులు అయన కృషికి గుర్తింపు ఇవ్వలేదని బాధపడ్డారు. ఇక మంత్రి గారు స్వంత శాఖ వారు కూడా ఈవిధంగా పట్టించుకోక పోవడం దారుణమని వాఖ్యానించారు. అయితే జిల్లా పనిచేస్తున్న యువ ఐఎఎస్ లంతా మంచి జోరు మీద వున్నారని వారికి సిఎం తప్ప మిగతావారు లెక్కలోకి రావడం లేదని పలువురు వాఖ్యానించారు. అర్బన్ హౌసింగ్ శాఖతో పాటు నగరపాలక సంస్థకు మంత్రి గారి కార్యాలయం నుంచి మెమో వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంమీద తిరుపతి నాయకులు, అధికారుల వల్ల నారాయణకు ఓ విచిత్ర అనుభవం ఎదురయిందని చెప్పవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌లో ఆ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి... ఏపీ ఆర్థిక మంత్రి