Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

Advertiesment
Nara Lokesh

ఠాగూర్

, శుక్రవారం, 1 నవంబరు 2024 (10:51 IST)
వైకాపా ప్రభుత్వంలో అధికార నేతల అండదండలతో రెచ్చిపోయి, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్ మరోమారు స్పష్టం చేశారు. ఇందులోభాగంగా, రెడ్ బుక్‌లోని మూడో చాప్టర్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అమెరికాలోని అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, 'చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం. సందేహం లేదు.. త్వరలోనే రెడ్‌బుక్‌ మూడో చాప్టర్‌ కూడా తెరుస్తాం. యువగళం పాదయాత్రలో నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. రెడ్‌బుక్‌కు భయపడుతున్న జగన్‌.. గుడ్‌బుక్‌ తీసుకొస్తానంటున్నారు. బుక్‌లో ఏమి రాయాలో ఆయనకు అర్థం కావట్లేదు. గతంలో సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే కేసులు పెట్టి లుకౌట్‌ నోటీసులు ఇచ్చేవారు. నోటీసులకు భయపడకుండా ఎన్‌ఆర్‌ఐలు నిలబడ్డారు.
 
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా తీసుకెళ్లాలి. సంక్షేమం అంటే ఏమిటో ఎన్టీఆర్‌ చూపించారు. ప్రపంచంలో తెలుగువారు తలెత్తుకొని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పుడూ ముందుంటాం. మీరు ఎన్‌ఆర్‌ఐలు కాదు.. ఎంఆర్‌ఐలు అని పిలుస్తా. ఎంఆర్‌ఐ అంటే ‘మోస్ట్‌ రిలయబుల్‌ ఇండియన్‌’ అని అర్థం. ఏపీలో కూటమి గెలుపు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారిది' అని లోకేశ్‌ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు