Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏయ్ పక్కకెళ్లు అంటూ డీఎస్పీపై విరుచుకుపడిన మంత్రి జోగి

jogi ramesh
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (16:48 IST)
ఏపీలో మంత్రులు అధికారమదంతో రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అధికారులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి కింది స్థాయిలో వైకాపా నేతలు కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ డీఎస్పీపై మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. 'ఏయ్.. పక్కకెళ్లు' అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఏపీ మంత్రి రోజా శుక్రవారం మచిలీపట్నం పర్యటనకు వచ్చారు. ఆమెకు మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పేర్ని నాని, ఇతర నాయకులు స్వాగతం పలికారు. ఆ సమయంలో పలువురు నాయకులు రోజాకు పుష్పగుచ్ఛం ఇచేందుకు పోటీపడ్డారు. ఒక్కో నేతలను మంత్రి రోజాకు మాజీ మంత్రి పేర్ని నాని పరిచయం చేశారు.
 
ఆ సమయంలో రోజాకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు వచ్చారు. అయితే, ఎస్పీ అడ్డుగా నిలబడిన వారిని పక్కకు జరగాలంటూ డీఎస్పీ మాన్షూ బాష కోరారు. డీఎస్పీ చేయి తనకు తగలడంతో పక్కకు వెళ్లు అంటూ డీఎస్పీపై మంత్రి జోగి రమేష్ చీదరించుకుంటూ మండిపడ్డారు. డీఎస్పీ వైపు కోపంగా చూశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంగా పుష్కరాలు.. సికింద్రాబాద్-బనారస్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు