Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'థూ... ఇదేం అసెంబ్లీ...' అమరావతి అసెంబ్లీపై అచ్చెన్న రచ్చరచ్చ?

అమరావతి అసెంబ్లీ భవన సముదాయంపై తొలుత అంతా ఓహో.. ఆహా అన్నారు కానీ ఆ తర్వాత రెండ్రోజులు అసెంబ్లీకి వెళ్లగానే దాని బండారం బయటపడిందంటున్నారు. లోపల డిజైనింగ్ మాయామహల్ తలపించేట్లుగా వుందని కొందరు నాయకులు లోలోన అనుకుంటున్నారు. ఇక మంత్రి అచ్చెన్నాయుడు అయితే

Advertiesment
AP minister Achennayudu comments
, శుక్రవారం, 17 మార్చి 2017 (12:25 IST)
అమరావతి అసెంబ్లీ భవన సముదాయంపై తొలుత అంతా ఓహో.. ఆహా అన్నారు కానీ ఆ తర్వాత రెండ్రోజులు అసెంబ్లీకి వెళ్లగానే దాని బండారం బయటపడిందంటున్నారు. లోపల డిజైనింగ్ మాయామహల్ తలపించేట్లుగా వుందని కొందరు నాయకులు లోలోన అనుకుంటున్నారు. ఇక మంత్రి అచ్చెన్నాయుడు అయితే డైరెక్ట్ ఎటాక్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.
 
అసెంబ్లీ గురించి పలువురు నాయకులు సూపర్ అంటూ వున్న సందర్భంలో మంత్రి అచ్చెన్నాయుడు అంతా దిమ్మతిరిగే వ్యాఖ్యలు చేశారట. ‘థూ... ఇదేం అసెంబ్లీ, బాత్రూంలో నీళ్లకు కూడా దిక్కులేదు' అని అన్నట్లు తెదేపా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అచ్చెన్న వ్యాఖ్యలతో అక్కడివారంతా ఆశ్చర్యపోయారట. 
 
నిజానికి చాలామందికి ఇదే అనుభవం ఎదురైనా.. ఎవరికివారు... సూపర్, భలే, చాలా బావుంది అంటూ ముఖస్తుతి మాటలు చెపుతున్నారట. అచ్చెన్నాయుడు మాత్రం కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారని అంటున్నారు. కాగా ఇటీవలి కాలంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే అచ్చెన్న పదవికి ఎర్త్ పడే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే అచ్చెన్నాయుడు అసంతృప్తితో వున్నారేమోననే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలో పవన్ క్రేజ్.. అరుంధతి నక్షత్రానికి బదులు పవన్‌ను ఫ్లెక్సీలో చూసిన కొత్త జంట!