Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జగన్ ప్రభుత్వంపై మగాళ్లు కోపంగా ఉన్నారు.. మంత్రి ధర్మాన

Advertiesment
dharmana

ఠాగూర్

, ఆదివారం, 10 మార్చి 2024 (09:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మగాళ్లు కోపంగా ఉన్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గ్రామీణ మండలం సింగుపురంలో శనివారం నిర్వహించిన వైఎస్ చేయూత నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలువురు లబ్దిదారులకు మంత్రి నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ వైకాపా ప్రభుత్వంపై రాష్ట్రంలోని మగాళ్లు కోపంగా ఉన్నారని అన్నారు. ప్రతి అవసరానికి భార్యను డబ్బులు అడగాల్సి రావడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేయాలని అంటున్నారని చెప్పారు. అయితే, ఇవేమీ పట్టించుకోకుండా వైకాపాకు ఓటు వేసి గెలిపించి ప్రభుత్వ పథకాలకు కృతజ్ఞత తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
''గత ఎన్నికల్లో మీరు అధికారం ఇచ్చారు. మీరు ఓట్లేసి అధికారం ఇచ్చి ఐదేళ్లు అవుతుంది. ప్రభుత్వ పథకాల పంపణీ సమయంలో పలుమార్లు ఏర్పాటు చేసిన సమావేశాల్లో మిమ్మల్ని కలిశాను. ఈ ప్రభుత్వంలో ఇదే చివరి సమావేశం. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. తర్వాత అధికారులతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేయడం కుదరదు" అని మంత్రి ధర్మాన అన్నారు. 
 
ఒక్క ఫోటోతో విడాకుల వార్తకు చెక్ పెట్టిన నయనతార 
 
ప్రముఖ నటి నయనతార తన వైవాహిక బంధం గురించి వస్తున్న వార్తలకు ఒక్క ఫోటోతో ఫుల్ స్టాప్ పెట్టారు. తాజాగా తన భర్త, సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్‌, తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఛార్టెడ్ ఫ్లైట్‌లో ప్రయాణం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె షోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోతో తాము విడిపోతున్నట్టు ప్రచారం చేస్తున్న వ్యక్తుల నోళ్ళతో పాటు మీడియా మైకులు కూడా మూయించింది. 
 
ఇటీవల నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేశారు. అప్పటి నుంచి ఈ జంటపై నెట్టింట విడాకుల రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే, వీటిపై ఇప్పటివరకు ఆమె ఎక్కడా స్పందించలేదు. కానీ, ఈ రూమర్స్ మరింత విస్తరిస్తుండటంతో వాటికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. 
 
అంతే.. లేడీ సూపర్ స్టార్ తాజాగా మరో ఫోటోను షేర్ చేసి అందరి నోళ్లు మూయించారు. భర్త విఘ్నేష్‌తో పాటు తమ పిల్లలతో కలిసి విదేశాకు వెళుతున్న సమయంలో తీసిన ఫోటోను ఆమె షేర్ చేశారు. నయన తన ప్యామిలీతో కలిసి జెడ్డా టూర్‌కు వెళ్లినట్టు సమాచారం. అలా జెడ్డాకు విమానంలో వెళుతున్న సమయంలో తీసిందే ఈ తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో కావడం గమనార్హం. 
 
ఈ ఫోటోకింద... చాలాకాలం తర్వాత ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్నా.. అనే క్యాప్షన్ ఇచ్చారామె. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలావుంటే, నయనతార విఘ్నేష్ జంట 2022 జూన్ 9వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత అదే యేడాది అక్టోబరు నెలలో నయనతార దంపతులు సరోగసి విధానం (అద్దె గర్భం)లో ఇద్దరు పిల్లలు పొందారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా: ఇక మిగిలింది ఒక్కరే