Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11 రోజులు అన్నం తినలేదని పవన్ చెప్పడం.. ప్రేమ ఎలాంటిదో..?: కేటీఆర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఏగూటి పక్షులు ఆగూటికే చేరుతాయన్న సామెతగా పవన్ కళ్యాణ్ జనసేన ఏపీకే పరిమితమైందని కేటీఆర్ తెలిపారు. ఏపీ విభజన తర్వాత ప

Advertiesment
AP Leaders
, సోమవారం, 12 సెప్టెంబరు 2016 (13:28 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఏగూటి పక్షులు ఆగూటికే చేరుతాయన్న సామెతగా పవన్ కళ్యాణ్ జనసేన ఏపీకే పరిమితమైందని కేటీఆర్ తెలిపారు. ఏపీ విభజన తర్వాత పవన్ 11 రోజులు అన్నం తినలేదని తెలపడం, ఆయనకు తెలంగాణపై ఉన్న మమకారం.. ప్రేమ ఎలాంటిదో అర్థం అయ్యిందన్నారు. పవన్ మాటలకు తెలంగాణ ప్రజలు బాధపడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ నేతలంతా ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రత్యేక హోదా సాధనకు ఎవరికీ చిత్తశుద్ధిని లేదని ఓ టీవీ ఛానల్‌లో కేటీఆర్ తెలిపారు. ఏపీకి న్యాయం చేయగల ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని కేటీఆర్ చెప్పారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడని టీఆర్ఎస్ పార్టీ కారణంగా ఏపీకి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని, విద్యాసంస్థలు, పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు, ప్యాకేజీలు, హోదాలు ఇలా ఎన్నో ప్రయోజనాలను ఏపీ సొంతం చేసుకుందంటే దానికి కారణం టీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినాయకుడికి చికెన్, మటన్, చేపలు, విస్కీ నైవేద్యంగా పెడతారట.. ఎక్కడో తెలుసా?