పరమశివుడు సర్వాంతర్యామి అని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సంబేపల్లె మండలం మోటకట్లలోని శివసాయి రామాలయంలో జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు గావించారు. ఆలయానికి విచ్చేసిన చీఫ్ విప్‌కు ఆలయ వ్యవస్థాపకులు పివి సుబ్బారెడ్డి కుటుంభ సభ్యులు, ఆలయ పూజారులు ఘనస్వాగతం పలికి ఆయన చేత పూజా కార్యక్రమాలు నిర్వహింపచేశారు.
ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందచేసి దుస్సాలువాతో శ్రీకాంత్ రెడ్డిని సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి నాడు పాటించే జాగరణ నిరంతర చైతన్యానికి, పరిసరాల పట్ల జాగురూతకు సంకేతమన్నారు. మహాశివుని కృషివల్ల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, ఎంపిటిసి అభ్యర్థి కాకులపల్లె రమణారెడ్డి, సంబేపల్లె సర్పంచ్ అంచల రామచంద్ర, వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రతాప్ రెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, హాబీబుల్లా ఖాన్,అబ్బవరం ఆనంద రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మోటకట్ల రెడ్డి, ద్వారక తదితరులు పాల్గొన్నారు.