ఏపీ సర్కారు మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి పలు అంశాలు చర్చలో వున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ సరదాగా చేసిన సోషల్ మీడియా రీల్, ఈ పథకం దుర్వినియోగం అవుతోందా అనే కొత్త వాదనకు దారితీసింది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ ఇటీవల ఆర్టీసీ బస్సు ముందు నిలబడి ఒక వీడియో రూపొందించింది.
"మా అమ్మకు కట్లపొడి, ఆకులు అంటే చాలా ఇష్టం. అవి తీసుకురావడానికి తాడిపత్రి నుంచి అనంతపురం వరకు ఉచితంగా బస్సులో వెళ్తున్నా" అంటూ ఆమె ఆ వీడియోలో తెలిపింది.
ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వస్తున్నాయి. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉద్యోగ, అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, కానీ ఇలాంటి చిన్న చిన్న వ్యక్తిగత పనులకు కూడా ప్రభుత్వ పథకాన్ని వాడుకోవడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు.