మీ పిల్లలు యూట్యూబ్‌లో ఏం చూస్తున్నా వదిలేస్తారా. తల్లితండ్రులను మందలించిన పోలీసు బాస్
ఆంధ్రప్రదేశ్ పోలీసు డీజీపీ సాంబశివరావు పిల్లలను కట్టడి చేయలేని తల్లిదండ్రుల బాధ్యతా రాహిత్యం గురించి అధికార పరిధికి మించిన వ్యాఖ్యలు చేసి సంచలనం కలిగించారు. రాష్ట్రంలో అమ్మాయిల అపహరణ కేసులు ప్రబలుతున్
ఆంధ్రప్రదేశ్ పోలీసు డీజీపీ సాంబశివరావు పిల్లలను కట్టడి చేయలేని తల్లిదండ్రుల బాధ్యతా రాహిత్యం గురించి అధికార పరిధికి మించిన వ్యాఖ్యలు చేసి సంచలనం కలిగించారు. రాష్ట్రంలో అమ్మాయిల అపహరణ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో డీజీపీ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. యూట్యూబ్‌లు, వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లలో పిల్లలు ఎలాంటి వీడియోలు చూస్తున్నారో, అవి చూడటం వల్ల వారు ఎలా మారుతున్నారో కనిపెట్టాల్సిన అవసరం లేదా అంటూ ఆయన మందలించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఏనాడూ ఉచిత సలహాలు ఇవ్వలేదన్న సాంబశివరావు.. పరిస్థితులు చేయిదాటిపోతున్నందునే ఇలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఒక్క బాపట్ల డివిజన్‌లోనే 16 మంది మైనర్ బాలికలు ఇండ్లలో చెప్పకుండా బయటికి వెళ్లిపోయారని, వాళ్లలో 13 మందిని పోలీసులు పట్టుకోగలిగారని డీజీపీ తెలిపారు.
పిల్లలు ఏం చేస్తున్నారో, మొబైల్‌ఫోన్లలో ఏం చూస్తున్నారో నిరంతరం కనిపెట్టాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎన్.సాంబశివరావు రాష్ట్రంలోని తల్లిదండ్రులను కోరారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ‘లిఖిత కిడ్నాప్’ కేసును ఛేదించిన సందర్భంగా, ఆ కేసులో పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లను డీజీపీ మీడియాకు వివరించారు. సోషల్ మీడియా దురుపయోగాలపై సమాజంలోని అన్ని వర్గాలూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. శుక్రవారం అమరావతిలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. లిఖిత కేసు గురించి మాట్లాడే క్రమంలో డీజీపీ సాంబశివరావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ఇటీవలి కాలంలో ఏపీలో కిడ్నాప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందులోనూ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయే బాలికల సంఖ్య అధికంగా ఉంది. ఈ పరిస్థితికి కారకులు ఎవరు పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా యూట్యూబ్‌లు, వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లలో పిల్లలు ఎలాంటి వీడియోలు చూస్తున్నారో, అవి చూడటం వల్ల వారు ఎలా మారుతున్నారో కనిపెట్టాల్సిన అవసరం లేదా’ అని డీజీపీ ప్రశ్నించారు. రాష్ట్ర జనాభా 5 కోట్ల మందికి గాను 50 వేల మంది పోలీసులే ఉన్నారని, పోలీసులు తలుచుకుంటే ఎలాంటి కేసునైనా ఛేదించగలరు కానీ.. వ్యవస్థలో లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
తన సుదీర్ఘ కెరీర్‌లో ఏనాడూ ఉచిత సలహాలు ఇవ్వలేదన్న సాంబశివరావు.. పరిస్థితులు చేయిదాటిపోతున్నందునే ఇలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఒక్క బాపట్ల డివిజన్‌లోనే 16 మంది మైనర్ బాలికలు ఇండ్లలో చెప్పకుండా బయటికి వెళ్లిపోయారని, వాళ్లలో 13 మందిని పోలీసులు పట్టుకోగలిగారని డీజీపీ తెలిపారు.