Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనేమో :: మండలి రద్దు... అయినా ఎమ్మెల్సీల ఆఫర్!

మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనేమో :: మండలి రద్దు... అయినా ఎమ్మెల్సీల ఆఫర్!
, ఆదివారం, 22 నవంబరు 2020 (12:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఓ పేరుంది. అదే.. మాట తప్పరు, మడమ తిప్పరు అని. కానీ, ఆయన గత కొన్ని రోజులుగా మాట తప్పుతున్నారు. పైగా, మడమ కూడా తిప్పేస్తున్నారు. నిజానికి రాజకీయాల్లో ఏ ఒక్క నాయకుడు కూడా మాటమీద నిలబడరు అనుకోండి. కానీ, జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా చేయని ఆంధ్రా ప్రజలు భావించారు. ఎందుకంటే.. ఆయన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు కాబట్టి. కానీ, జగన్ రెడ్డి గత కొంతకాలంగా ఇష్టానుసారంగా మాట తప్పుతున్నారు.. మడమ తిప్పేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తిరుపతి ఎంపీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడికి వైకాపా సీటు ఇస్తారని భావించారు. కానీ, అలా చేయలేదు. కొత్త నేతను అభ్యర్థిగా ప్రటించారు. అంతేకాదండోయ్... బల్లి దుర్గాప్రసాద్ తనయుడిని ఎమ్మెల్సీ చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారట. ఇది కాస్త విచిత్రంగానూ, వింతగానూ వుంది. 
 
గతంలో ఏపీ వికేంద్రీకర బిల్లుతో పాటు... సీఆర్డీయే బిల్లు రద్దు బిల్లులకు శాసనమండలి మోకాలొడ్డింది. దీంతో శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ప్రస్తుతం ఈ బిల్లు కేంద్రం హోం శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. 
 
శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానం చేసినందున అప్పటివరకు మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపించారు. వీరితో మంత్రి పదవులకు రాజీనామా చేసిమరీ పెద్దల సభకు జగన్ పంపించారు. 
 
అలాంటపుడు... బల్లి దుర్గా ప్రసాద్ తనయుడిని సీఎం జగన్ ఎలా ఎమ్మెల్సీ చేస్తారో వైకాపా నేతలకే ఎరుక. ఇదే అన్నమాట మాట తప్పం.. మడమ తిప్పం అంటే... ఎంతైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కదా!! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సికింద్రాబాద్ పరిధిలో పరుగులు తీయనున్న ప్రైవేట్ రైళ్లు.. రూట్ల వివరాలు...