Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్: ఏపీ సర్కారు కొత్త పథకం

Advertiesment
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్: ఏపీ సర్కారు కొత్త పథకం
, మంగళవారం, 11 జనవరి 2022 (10:28 IST)
ఏపీ సర్కారు కొత్త పథకం ప్రారంభిస్తోంది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ద్వారా జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ద్వారా మధ్య ఆదాయ వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. 
 
జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ద్వారా మధ్య ఆదాయ వర్గాల వారికి భూముల ధరలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెప్తుంది. ఇళ్లస్థలాల కోసం ఇవాల్టి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తారు. 
 
ఈ పథకం తొలిదశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమలు చేస్తారు. ఆ తరవాత రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పథకం అమలు చేస్తారు.
 
రూ.18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు. అర్హులైనవారికి వారు ఉంటున్న ప్రాంతంలోనే తక్కువ ధరకు స్థలం కేటాయిస్తారు. 
 
కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా ప్రభుత్వం ప్లాట్లు కేటాయిస్తుంది. ఈ పథకంలో లబ్ది దారుల అవసరం మేరకు 150, 200, 240 గజాల స్థలాల్లో తమకు నచ్చిన దాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో ఘోరం.. భార్యల మార్పిడి.. మహిళపై తొమ్మిది మంది అత్యాచారం