ఆస్కార్ అంటే పద్మ పురస్కారాలు అనుకుంటున్నావా బాబూ.. సోషల్ మీడియాలో సెటైర్లు
ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు మరోసారి నెటిజన్లకు చిక్కిపోయారు. సోషల్ మీడియాపై ఎన్ని ఆంక్షలు విధించినా, అరెస్టులు చేయించినా వెనక్కు తగ్గేది లేదన్నట్లుగా ఈసారి నేరుగా బాబునే టార్గెట్ చేసుకుంటున్నారు యువత. వివరాల్లోకి వెళ్తే - బాహుబలి-2 చ
ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు మరోసారి నెటిజన్లకు చిక్కిపోయారు. సోషల్ మీడియాపై ఎన్ని ఆంక్షలు విధించినా, అరెస్టులు చేయించినా వెనక్కు తగ్గేది లేదన్నట్లుగా ఈసారి నేరుగా బాబునే టార్గెట్ చేసుకుంటున్నారు యువత. వివరాల్లోకి వెళ్తే - బాహుబలి-2 చిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసించిన సీఎం చంద్రబాబు, భారత్ నుండి ఈ సినిమాను ఆస్కార్ అవార్డుకు సిఫారసు చేసేలా కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు.
కానీ ఈ వ్యాఖ్యలను వక్రీకరించిన పలువురు ప్రబుద్ధులు ఆయనపై విమర్శల వర్షం కురిపించడం ప్రారంభించారు. ఆస్కార్ అనేది యావత్ ప్రపంచ సినీరంగ నిపుణుల కలే అయినప్పటికీ, మన మోదీగారితో ఓ మాట చెప్పించేస్తే ఆస్కార్ అవార్డుల కమిటీ పాటించేసి, బాహుబలి-2కి అవార్డుని ప్రకటించేస్తుందా అని వ్యంగ్య బాణాలు ఎక్కుపెట్టారు.
భాజపాతో పొత్తు పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వంలో కొన్ని అమాత్య పదవులు, అనుయాయులైనవారికి పద్మ పురస్కారాలు రాబట్టుకోగలరు కానీ ఆస్కార్ సైతం ఇప్పించేయగలరా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి బాబుగారిపై. కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశ పార్టీ వ్యవస్థాపకుడు, నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావుగారికి 'భారతరత్న' ఇప్పించలేకపోతున్న బాబు, ఏకంగా ఆస్కార్‌కే గురిపెట్టడం విడ్డూరమేనంటూ వైరి వర్గాలు ఆయన్ను టార్గెట్ చేశాయి. ఏదేమైనా బాహుబలికి ఆస్కార్ అవార్డులు వస్తే అంతకన్నా మించినదేముంది చెప్పండి.