రంగస్వామి నాయుడుకి చంద్రబాబు సంతాపం(వీడియో)
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని శాంతిపురం మండలం తుమ్మిసి హెలిప్యాడ్‌కు గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర బాబు, గిరీషా తదితరులు స్వాగతం పలికారు. బ
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని శాంతిపురం మండలం తుమ్మిసి హెలిప్యాడ్‌కు గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర బాబు, గిరీషా తదితరులు స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చారు. శాంతిపురంలో మాజీ దివంగత మాజీ శాసనసభ్యులు రంగస్వామి నాయుడు గృహానికి విచ్చేశారు.
రంగస్వామి నాయుడు చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు రంగస్వామి నాయుడు భార్య హేమావతి, మొదటి కుమారుడు హేమాద్రి నాయుడు, పెద్ద కోడలు సునీత, రెండవ కోడలు సునీత, మనవళ్లు లిఖిత్, వినీత్, కౌశిక్‌లను పరామర్శించి రంగస్వామి నాయుడుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
వారి కటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత రంగస్వామి నాయుడు సర్పంచిగా, సమితి వైస్ ప్రెసిడెంటుగా, ఎమ్మెల్యేగా, ఏడిబి బ్యాంక్ ప్రెసిడెంట్, ఆర్టీఏ మెంబర్, టిటిడి బోర్డు మెంబరుగా వివిధ పదవులలో ప్రజలకు ఎనలేని సేవ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.