Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్ పాలనను కాపీ కొడుతున్న చంద్రబాబు.. ఎందుకు?

అన్ని పాఠశాలల్లో తెలుగును నిర్బంధం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎపుడో ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ నిండుమనసుతో స్వాగతించారు కూడా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం

Advertiesment
AP CM Chandrababu Naidu
, సోమవారం, 16 అక్టోబరు 2017 (06:19 IST)
అన్ని పాఠశాలల్లో తెలుగును నిర్బంధం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎపుడో ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ నిండుమనసుతో స్వాగతించారు కూడా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఇప్పటికి మేల్కొన్నారు. వచ్చే యేడాది నుంచి తెలుగును తప్పనిసరి చేస్తారట. 
 
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. విద్యాలయాల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. తెలుగును మరిస్తే ఉనికినే కోల్పోతామన్నారు. వచ్చే ఏడాది విద్యా రంగానికి అదనంగా మరో రూ.30కోట్లు కేటాయిస్తామన్నారు.
 
‘నేను ఒకటే నమ్ముతాను. రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీకే ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పడం లేదు..ఇరవై సంవత్సరాలుగా చెబుతున్నాను. మన పిల్లలకు మనం ఎన్ని ఆస్తులు ఇస్తాం, ఎంత భూమి ఇస్తామనేది ముఖ్యం కాదు. మన పిల్లల్ని ఎంత బాగా చదివిస్తాం, ఎంత మంచి సంస్కారం నేర్పిస్తాం అనేది ముఖ్యం. చదువు.. తెలివినిస్తుంది, ఏదైనాసరే, సాధించే శక్తినిస్తుందన్నారు. 
 
‘నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు చదువుకు ప్రాధాన్యత ఇచ్చాను. ఆరోజు ఓ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ఒక్క కిలోమీటర్ దూరంలో ఎలిమెంటరీ స్కూల్ , మూడు కిలోమీటర్ల దూరంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ , ఐదు కిలోమీటర్ల దూరంలో హైస్కూల్, ప్రతి మండలానికి జూనియర్ కళాశాల, అదే విధంగా రెవెన్యూ డివిజన్‌కు ఒక ఇంజనీరింగ్ కళాశాల, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలని ప్రయత్నం చేశాను. కాలేజీలు పెడితే లాభం లేదు, అందరికీ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఐటీ కంపెనీలను ప్రమోట్ చేశాను. ఐటీ కంపెనీలు ప్రమోట్ చేసిన తర్వాత మనవాళ్లు వేరే దేశాలకు వెళ్లారు. ప్రపంచంలో 25 శాతం ఐటీ ఇంజనీర్లు మన వాళ్లు ఉన్నారంటే దానికి కారణం ఆ రోజున నేను వేసిన విత్తనమేనని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీకి షాకిచ్చిన పంజాబ్ ఓటర్లు... బైపోల్‌లో కాంగ్రెస్‌ గ్రాండ్ విక్టరీ