Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ సచివాలయంలో జెండా ఎగురవేసిన సిఎస్. సమీర్ శర్మ

Advertiesment
ఏపీ సచివాలయంలో జెండా ఎగురవేసిన సిఎస్. సమీర్ శర్మ
విజ‌య‌వాడ‌ , బుధవారం, 26 జనవరి 2022 (18:09 IST)
గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘణంగా నివాళులర్పించారు. అనంత‌రం జాతీయ జెండాను ఎగురవేశారు.


అనంతరం సిఎస్ డా.శర్మ మాట్లాడుతూ, భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమర యోధులు,రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ సహా ఇతర ప్రముఖుల త్యాగాలను వారి కృషిని ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాల్సిన తరుణమిదని సిఎస్ చెప్పారు.
 
 
గ‌త రెండేళ్ళుగా కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ ఆసమస్యలన్నిటినీ ప్రభుత్వం అధికమించి ప్రజలకు తగిన మెరుగైన సేవలు అందించేందుకు విశేష కృషి చేయడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను గ్రామ స్థాయి వరకూ తీసుకువెళ్ళి సకాలంలో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎనలేని కృషి చేస్తోందని వారి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. రానున్న రోజుల్లో అధికారులు, సిబ్బంది మరింత చిత్తశుద్ది అంకిత భావాలతో పనిచేసి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని సిఎస్ డా.సమీర్ శర్మ ఆకాంక్షించారు.
 
 
పలువురు చిన్నారులు, మహిళా సిబ్బంది తదితరులకు సిఎస్ డా.సమీర్ శర్మ మిఠాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం చీఫ్ సెక్యురిటీ అధికారి కృష్ణ మూర్తి, సచివాలయ అధికారులు, ఉద్యోగులు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ ను అరాచకాంధ్రప్రదేశ్ గా మార్చేశారు...