Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ మంత్రి వర్గం విస్తరణ: అయిదుగురు ఔట్.. సీమకు పండగే పండగ

ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాబోయే మంత్రులు జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శనివారం అర్థరాత్రి ప్రకటించిన తాజా మంత్రుల జాబితాలో రాయలసీమకు అగ్రపీఠం దక్కింది. నాలుగు జిల్లాల నుంచి

Advertiesment
AP Cabinet
హైదరాబాద్ , ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (01:35 IST)
ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాబోయే మంత్రులు జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శనివారం అర్థరాత్రి ప్రకటించిన తాజా మంత్రుల జాబితాలో రాయలసీమకు అగ్రపీఠం దక్కింది. నాలుగు జిల్లాల నుంచి మొత్తం ఆరుమందికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. కేబినెట్‌లోంచి అయిదుగురు మంత్రులను తొలగించగా కొత్తగా 11 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. పార్టీ ఫిరాయించి మరీ పచ్చకండువా కప్పుకున్న వైకాపా ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రిపదవులు దక్కడం గమనార్హం. కొత్త మంత్రుల జాబితా, తొలగించిన మంత్రుల జాబితాను ఇక్కడ పొందుపరుస్తున్నాం. 
 
కొత్త మంత్రులు వీరే...
1. నారా లోకేశ్‌ (ఎమ్మెల్సీ)
2. కిమిడి కళావెంకట్రావు (ఎమ్మెల్సీ)
3. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (ఎమ్మెల్సీ)
4. నక్కా ఆనంద్‌బాబు (ఎమ్మెల్యే)
5. పితాని సత్యనారాయణ (ఎమ్మెల్యే)
6. కొత్తపల్లి జవహర్‌ (ఎమ్మెల్యే)
7. కాల్వ శ్రీనివాసులు (ఎమ్మెల్యే)
8. భూమా అఖిలప్రియ (ఎమ్మెల్యే)
9. అమర్‌నాథ్‌రెడ్డి (ఎమ్మెల్యే)
10 ఆదినారాయణరెడ్డి (ఎమ్మెల్యే)
11. సుజయకృష్ణ రంగారావు (ఎమ్మెల్యే)
 
వీరిలో చివరి నుంచి నాలుగు స్థానాల్లో ఉన్నవారు ఫిరాయింపుదారులు
 
ఉద్వాసన వీరికే..
1. కిమిడి మృణాళిని
2. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
3. పీతల సుజాత
4. రావెల కిషోర్‌బాబు
5. పల్లె రఘునాథ్‌రెడ్డి  

కొత్తమంత్రులతో సహా జిల్లాలవారీగా మంత్రుల జాబితా ఇదీ.
శ్రీకాకుళం: అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు
విజయనగరం: సంజయ్‌ కృష్ణ రంగారావు
విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు
తూర్పుగోదావరి: యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప
పశ్చిమగోదావరి: కేఎస్‌. జవహర్‌, పితాని సత్యనారాయణ, మాణిక్యాలరావు
కృష్ణా: కామినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర
గుంటూరు: ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు
ప్రకాశం: సిద్ధా రాఘవరావు
నెల్లూరు: నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
కడప: ఆదినారాయణరెడ్డి
కర్నూలు: కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ
అనంతపురం: పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు
చిత్తూరు: నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, అమర్‌నాథ్‌ రెడ్డి
 
ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో 20 మంది సభ్యులున్నారు. వాస్తవంగా 26 మందికి అవకాశం ఉంది. 5గురి తొలగింపు, కొత్తగా 11 మంది చేరికతో సీఎంతో సహా మంత్రుల సంఖ్య 26కు చేరనుంది. కొత్త మంత్రులుగా 11 మందితో ఆదివారం ఉదయం 9.22 గంటలకు వెలగపూడి సచివాలయం వద్ద గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కిమిడి మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, రావెల కిషోర్‌బాబు, పల్లె రఘునాథ్‌రెడ్డిలను కేబినెట్‌ నుంచి తొలగించారు.
 
నేడు అంటే ఆదివారం ఉదయం  9.22 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణం  చేయనున్నారు. వెలగపూడి సచివాలయానికి సమీపంలో ఈ కార్యక్రమం జరుపనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదుగురు మంత్రులు ఔట్? లోకేష్, అఖిలప్రియ మినిస్టర్స్... ఇంకా 9 మంది...