Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మున్సిపల్ యాక్ట్ రద్దు.. అమరావతిలో ఇంజనీరింగ్ కాలేజీలు.. ఏపీ కేబినెట్ నిర్ణయం

amaravati

ఠాగూర్

, గురువారం, 2 జనవరి 2025 (13:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం గురువారం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, రాజధాని అమరావతి ప్రాంతంలో రెండు ఇంజనీరింగ్ కాలేజీలను నిర్మించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే, మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. భవనాలు, లేఔట్‌ల అనుమతుల బాధ్యత మున్సిపాలిటీలకు అప్పగించాలని కేబినెట్ తీర్మానించింది. 
 
రాజధాని అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయించిన రెండు పనులకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపింది. దీంతో భవనాలు, లేఔట్‌ల అనుమతుల జారీ బాధ్యత మున్సిపాలిటీలకు కట్టబెట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 
 
ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలో కొత్త 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
అలాగే, తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కు పెంచాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదముద్ర వేసింది. వీటితో పాటు రామాయపట్నంలో బీపీసీఎల్‌లో రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు, ఎస్.ఐ.పి.బీ ఆమోదించిన 182162 కోట్ల పెట్టుబడులు, చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై చర్చ జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం 2025: ఒంటరిగా శక్తిని పెట్టుబడి పెట్టే వ్యక్తి..