Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో కొత్తగా 50 అసెంబ్లీ స్థానాలు - మొత్తం 225, ఏంటా లెక్క?

తెలంగాణాలో ఇప్పటికే అసెంబ్లీ స్థానాలను పెంచేశారు ముఖ్యమంత్రి కెసిఆర్. అసెంబ్లీ స్థానాలు పెరిగికొద్దీ అభివృద్థి జరుగుతుందని వారి భావన. నియోజవర్గం పెద్దదిగా ఉంటే అభివృద్థి చేయలేమన్నది అందరికీ తెలిసిందే. దీన్నే పరిగణలోకి తీసుకున్న కెసిఆర్ ఒక్కసారిగా తెల

ఏపీలో కొత్తగా 50 అసెంబ్లీ స్థానాలు - మొత్తం 225, ఏంటా లెక్క?
, శనివారం, 1 ఏప్రియల్ 2017 (12:39 IST)
తెలంగాణాలో ఇప్పటికే అసెంబ్లీ స్థానాలను పెంచేశారు ముఖ్యమంత్రి కెసిఆర్. అసెంబ్లీ స్థానాలు పెరిగికొద్దీ అభివృద్థి జరుగుతుందని వారి భావన. నియోజవర్గం పెద్దదిగా ఉంటే అభివృద్థి చేయలేమన్నది అందరికీ తెలిసిందే. దీన్నే పరిగణలోకి తీసుకున్న కెసిఆర్ ఒక్కసారిగా తెలంగాణాలో అసెంబ్లీ స్థానాలను పెంచేశారు. ఇక ఆ బాటలోనే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నడుస్తున్నారు. ఎపిలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిని మరో 50 పెంచాలని నిర్ణయం తీసుకున్నారట. ఏయే జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయో చూద్దామా.. 
 
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాల వివరాలు ఇవి..
 
అనంతపురం జిల్లాలో ఇప్పుడున్న 14 అసెంబ్లీ స్థానాలకు మరో అసెంబ్లీ స్థానం పెరగనుంది. 
చిత్తూరు జిల్లాలో ఇప్పుడున్న 14 అసెంబ్లీ స్థానాలకు మరో 4 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
కడప జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ స్థానాలకు మరో 3 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడున్న 19 అసెంబ్లీ స్థానాలకు మరో 6 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి.
గుంటూరు జిల్లాలో ఇప్పుడున్న 17 అసెంబ్లీ స్థానాలకు మరో 5 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
కృష్ణా జిల్లాలో ఇప్పుడున్న 16 అసెంబ్లీ స్థానాలకు మరో 4 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
కర్నూల్ జిల్లాలో ఇప్పుడున్న 14 అసెంబ్లీ స్థానాలకు మరో 4 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ స్థానాలకు మరో 3 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
ప్రకాశం జిల్లాలో ఇప్పుడున్న 12 అసెంబ్లీ స్థానాలకు మరో 3 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడున్న 15 అసెంబ్లీ స్థానాలకు మరో 4 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ స్థానాలకు మరో 3 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
విజయనగరంజిల్లాలో ఇప్పుడున్న 9 అసెంబ్లీ స్థానాలకు మరో 2 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి.
విశాఖపట్టణంజిల్లాలో ఇప్పుడున్న 15 అసెంబ్లీ స్థానాలకు మరో 5 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి.
 
అసెంబ్లీ స్థానాలు పెరగడం ముఖ్యం కాదు కానీ అభివృద్థి జరగడం ముఖ్యమంటున్నారు ప్రజలు. మరి అసెంబ్లీ నియోజవర్గాలను పెంచిన తరువాత ఏమాత్రం అభివృద్ధి చేస్తారో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా వెనుకెవరున్నా ఎన్టీఆర్ వెన్నుపోటు గుర్తొస్తుంది... వెంకయ్య ఎవరినన్నారు?