Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు ప్రమాద రహిత దినం... వాహనం చిన్నగా నడపాలని విజ్ఞప్తి...

నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రమాద రహిత దినోత్సవంగా జనవరి 31 తేదీని ప్రకటించాయి. ఈ మంగళవారం సాధ్యమైనంత మేరకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం. రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రహదారులు రక్తమోడుతున్నాయి.

నేడు ప్రమాద రహిత దినం... వాహనం చిన్నగా నడపాలని విజ్ఞప్తి...
, మంగళవారం, 31 జనవరి 2017 (19:41 IST)
నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రమాద రహిత దినోత్సవంగా జనవరి 31 తేదీని ప్రకటించాయి. ఈ మంగళవారం సాధ్యమైనంత మేరకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం. రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రహదారులు రక్తమోడుతున్నాయి. నిత్యం ప్రమాదాల రూపంలో ప్రయాణికులను బలితీసుకుంటున్నాయి. ఇంటి నుంచి బయటకొస్తే మళ్లీ సురక్షితంగా ఇంటికి తిరిగి చేరతామా అనేది సందేహాస్పదమే. 
 
ఆంధ్రప్రదేశ్‌లో సరాసరిన రోజుకు 55 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా వాటిలో 47 మంది మృత్యువాతపడుతున్నారు. ప్రతి ఏటా వేల మంది మృతి చెందుతుండగా ఆ సంఖ్యకు రెట్టింపు లెక్కల్లో గాయాలపాలవుతున్నారు. ప్రమాదాల నమోదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో 4వ స్థానంలో ఉంది. 
 
తెలంగాణాలో ఏడాదికి సరాసరి ఎనిమిది వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. 30 వేల మంది క్షతగాత్రులవుతుండగా 20 వేల కేసులు నమోదవుతున్నాయి. మితిమీరిన వేగం, ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించడం, హెల్మట్‌లు ధరించకపోవడం, సీట్ బెల్టులను పెట్టుకోకపోవడం, లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం, ఆటోలు పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 
 
వాహనాలను నడిపే చోదకులు ముందుగా వేగం వద్దు.. నెమ్మది ముద్దు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల వల్ల ప్రమాద బాగిన పడిన వారి కుటుంబాలు వీధిన పడతాయని, అట్లే ప్రమాదంలో దురదృష్టం కొద్దీ తమకే ప్రాణాపాయం జరిగితే తమ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చినవారవుతారు. ఈ విషయాన్ని గుర్తెరిగి వాహాన చోదకులు తమ వాహనాలను నడపాలి. ప్రమాద రహిత దినమైన ఈ మంగళవారం మంగళప్రదంగా జరగాలనీ, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సీట్ బెల్ట్ లను, హెల్మెట్లను ధరించి, నెమ్మదిగా వాహనం నడపి ప్రమాదాలు జరగని రోజుగా ఉంచేందుకు అందరూ ప్రయత్నించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క రోజైనా గడపమన్నాడు.. నో చెప్పడంతో నెట్లో ఫోటోను యాడ్ చేశాడు.. 100 కాల్స్ వచ్చాయ్