ఈ వేసవికాలంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలుమండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇందులోభాగంగా, గురువారం ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 77 మండలాల్లో వడగాల్పులు వీచాయి. అనేకచోట్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది.
కాకినాడ జిల్లా చామవరంలో 44.2, ప్రకాశం జిల్లా కొనకనమి, విజయనగరం జిల్లా నెల్లిమర్లల్లో 13.8, తిరుపతి జిల్లా సత్యవేడులో 43.7, కృష్ణా జిల్లా గన్నవరం, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లుల్లో 43.5, తుని, జంఘ మహేశ్వరపురంలో 434 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శుక్రవారం 81 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 211 మండలాల్లో వడగాల్పులు, శనివారం 121 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 198 మండలాల్లో వడగా ల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 12వ తేదీ వరకు వడగాల్పులు కొనసాగి, ఆ తరువాత క్రమేపీ తగ్గుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.
కాగా, ఉత్తరకోస్తాపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల గురువారం ఉరుములు, ఈదురు గాలులతో వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు ఎండ తీవ్రత, వడగాల్పులు, ఈదురుగా లులతో కురిసే వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ హెచ్చరించారు. శుక్రవారం వివిధ జిల్లాల్లోని 81 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 211 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఆయన వివరించారు.