Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు ష్విప్ట్ డిజైర్ కార్లు... ఆంధ్రా సీఎం ఆఫర్

బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు ష్విప్ట్ డిజైర్ కార్లు... ఆంధ్రా సీఎం ఆఫర్
, శనివారం, 5 జనవరి 2019 (13:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ బ్రాహ్మణ యువతకు ష్విఫ్ట్ డిజైర్ కార్లను అందజేయనున్నారు. ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ కార్లను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహుకరించనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగే ఓ కార్యక్రమంలో 30 మంది ష్విఫ్ట్ డిజైర్ కార్లను ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్ల కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో లబ్దిదారుడు 10 శాతం భరించాల్సివుంటుంది. మరో రెండు లక్షల రూపాయల రాయితీని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మిణ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నెలవారీ ఈఎంఐలలో చెల్లించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందీలోకి రీమేక్ కానున్న తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ