ఇండియా జస్టిస్ రిపోర్ట్- 2025 ప్రకారం న్యాయం అందించడంలో 18 పెద్ద- మధ్య తరహా రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. 2022లో ఐదవ స్థానం నుండి ఏపీ రాష్ట్రం ఎగబాకింది. దక్షిణాది రాష్ట్రం 'జైళ్ల' విభాగంలో నాల్గవ స్థానంలో, న్యాయ సహాయంలో ఐదవ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది.
"మా ర్యాంకింగ్ మెరుగుకావడంపై మేము సంతోషిస్తున్నాము. తదుపరి ర్యాంకింగ్‌లో నంబర్-1గా ఉండటానికి మేము కట్టుబడి ఉన్నాము" అని టిడిపి జాతీయ ప్రతినిధి జ్యోత్స్న తిరునగరి అన్నారు.
టాటా ట్రస్ట్స్ ప్రారంభించి, 2019లో మొదటిసారి ప్రచురించబడిన ఐజేఆర్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, ఇతరుల సహకారంతో ఏర్పడింది.
24 నెలల పరిమాణాత్మక పరిశోధన ఆధారంగా, 2025 ఎడిషన్ న్యాయ పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడంలో రాష్ట్రాల పనితీరును, తప్పనిసరి సేవలను సమర్థవంతంగా అందించే సామర్థ్యాన్ని ట్రాక్ చేస్తుంది.