Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్-19 సమాచారం కోసం 'ఆంధ్రప్రదేశ్' మొబైల్ అప్లికేషన్

Advertiesment
Andhra Pradesh
, శనివారం, 25 జులై 2020 (09:09 IST)
రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు రోజురోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. కోవిడ్-19 టెస్టుల సంఖ్య పెంచే కొద్దీ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.

కోవిడ్ లక్షణాలు ఉంటే ఎవరిని సంప్రదించాలి? ఎక్కడ టెస్టులు చేయించుకోవాలన్న సందేహాలు ఇప్పటికీ ప్రజల్లో ఉంటున్నాయి.
 
కోవిడ్-19 కి సంబంధించిన అన్ని సందేహాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ  కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ అనే మొబైల్ అప్లికేషన్ రూపొందించింది. 
 
కోవిడ్-19పై పోరాటంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలకు సంబంధించిన సమాచారం ఈ మొబైల్ అప్లికేషన్లో ఉంటుంది.
 
రాష్ట్రంలోని కోవిడ్-19 ఆస్పత్రుల వివరాలు, క్వారంటైన్ కేంద్రాల సమాచారం, కోవిడ్ పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని కరోనా పాజిటివ్ కేసులు, డిశ్ఛార్జ్ అయిన వారు, మరణాల సంఖ్యతోపాటు ప్రతి రోజు ప్రభుత్వం విడుదల చేసే మీడియా బులిటెన్ సైతం ఈ యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనలో ఉన్న లక్షణాలను బట్టి కోవిడ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
అంతేకాకుండా మీ ప్రాంతంలో ఉండే వార్డు వాలంటీర్, ఎఎన్ఎం, డాక్టర్ ను సంప్రదించడం తదితర వివరాలను తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ యూజర్లు https://bit.ly/30FvmBm లింక్ నుంచి ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
కోవిడ్-19కి సంబంధించిన ఎలాంటి సమాచారం కోసమైనా, ఇతర సహాయం కోసమైనా జాతీయస్థాయి హెల్ప్ లైన్ 1075, రాష్ట్రస్థాయిలో 104కి కాల్ చేయవచ్చు.
 
వై.ఎస్.ఆర్. టెలీమెడిసిన్ నెంబర్ 14410కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ ద్వారా డాక్టర్ గారితో మాట్లాడి మీ ఆరోగ్య సమస్యలను తెలపవచ్చు.

ఇంకనూ కోవిడ్-19 కు సంబంధించిన అధికారిక సమాచారం కోసం 8297104104 వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయొచ్చు లేదా 8297104104 నెంబర్ కు డయల్ చేసి ఐవిఆర్ఎస్(IVRS) ద్వారా సహాయం పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ నుంచి కోలుకున్న తల్లి.... ఇంట్లో అడుగుపెట్టొద్దంటూ కొడుకు హుకుం