Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొడాలి నాని జంప్ జిలానీనా? లుకౌట్ నోటీసు జారీ!!

Advertiesment
kodali nani

ఠాగూర్

, శుక్రవారం, 23 మే 2025 (08:31 IST)
గత వైకాపా ప్రభుత్వంలో తన చేష్టలతోనేకాకుండా నోటికి కూడా పని చెప్పి బూతుల మంత్రిగా ప్రత్యేక గుర్తింపు పొందిన వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వర రావు ఇపుడు కనిపించడం లేదు. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ మేరకు కృష్ణా జల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులను జారీచేశారు. 
 
కొడాలి నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న సమయంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ డీజీపీకి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస రావు ఫిర్యాదు చేశారు. 
 
అనారోగ్య సమస్యలను సాకుగా చూపి అమెరికా వెళ్లేందుకు కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నాని పాస్ పోర్టును సీజ్ చేయాలంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్.. కొడాలి నానికి వ్యతిరేకంగా లుకౌట్ నోటీసులు జారీచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Visakhapatnam Covid Case: విశాఖపట్నంలో కొత్త కరోనా వైరస్ కేసు- మహిళకు కరోనా పాజిటివ్