ఏపీలో హైటెక్ వ్యభిచారం.. ముఠా అరెస్ట్.. చిత్తూరు బస్టాండ్ సమీపంలో...
ఏపీలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ వ్యభిచారాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ వారినికో సెక్స్ రాకెట్ బయటపడుతోంది. సులువుగా డబ్బు సంపాదించడానికి ఇదే సులువైన మార్గంగా కొందర
ఏపీలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ వ్యభిచారాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ వారినికో సెక్స్ రాకెట్ బయటపడుతోంది. సులువుగా డబ్బు సంపాదించడానికి ఇదే సులువైన మార్గంగా కొందరు వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుంటున్నారు. రోజు రోజుకు వ్యభిచారం విచ్చల విడిగా జరుగుతుంది. ఇక ఏపీలో ఎక్కువ శాతం తిరుపతి, చిత్తూరు, మదనపల్లిలో ఎక్కువగా విటులు పట్టుబడుతున్నారు.
తాజాగా ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరుగురిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పోలీసుల నుంచి తప్పించుకుని పరారైన లాడ్జి యజమానిపై కేసునమోదైంది. మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్లు ఆదివారం టూటౌన్ పోలీసులకు సమాచారం వచ్చింది. సీఐ హనుమంతనాయక్ తమ సిబ్బందితో కలసి లాడ్జి వద్దకు చేరుకుని దాడులు నిర్వహించారు.
లాడ్జిలోని ఓ గదిలో మేనేజర్‌తో పాటు విటుడు, వ్యభిచారం చేస్తున్న నలుగురు మహిళలు పోలీసులకు పట్టుబడ్డారు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.2,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.