Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈసారి కూడా బాలికలదే పైచేయి

Advertiesment
Andhra Pradesh Intermediate 1st
, శుక్రవారం, 12 జూన్ 2020 (17:27 IST)
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో భాగంగా తొలి సంవత్సరం 59 శాతం మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ఈసారి ఫలితాల్లో కూడా బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. 
 
ఇంటర్ తొలి సంవత్సరం ఫలితాల్లో కృష్ణాజిల్లా తొలి స్థానంలో నిలవగా, పశ్చిమ గోదావరి రెండవ స్థానం, గుంటూరు మూడవ స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం రద్దు అయినందున ఫస్ట్ ఇయర్ ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ప్రకటించారు. అయితే, సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మాత్రం గ్రేడ్లను ప్రకటించారు. 
 
అసలు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ఇంటర్ ఫలితాలను ప్రకటించలేదు. ఏపీనే తొలి రాష్ట్రం కావడం విశేషం. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం 5,07,228 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 3,00,560 మంది ఉత్తీర్ణులయ్యారని, అలాగే 4,88,795 మంది రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలను రాయగా.. 2,76,389 మంది పాస్ అయ్యారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరిగిపోతున్న నిరుద్యోగం... హెచ్1బి వీసాల రద్దు దిశగా అడుగులు?