తిరుమల కొండలను కాలినడకన ఎక్కే భక్తులకు గుడ్ న్యూస్. అలిపిరి మార్గంలో 10 వేల శ్రీవారి మెట్టు మార్గంలో 5,000 టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల కొండలను కాలినడకన ఎక్కే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏప్రిల్-1 నుంచి దివ్యదర్శనం టోకెన్లను జారీ చేయనుంది.
ఈ మేరకు సోమవారం మీడియా ప్రతినిధులతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అలిపిరి మార్గంలో 10వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో ఐదు వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ వ్యవస్థ కోవిడ్‌కు ముందు వాడుకలో ఉంది. ఆ కాలంలో ఇది నిలిపివేయబడింది. అయితే, ఇప్పుడు దాన్ని పునరుద్ధరిస్తున్నారు.
అలాగే, వేసవిలో భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని, బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖల సంఖ్యను తగ్గించడంతోపాటు, పారదర్శక పద్ధతిలో ముఖ గుర్తింపు ద్వారా యాత్రికులకు వసతి అందుబాటులో ఉంచబడుతుందని ఆయన పేర్కొన్నారు.