Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు నోట కేపిటల్ మాట: విజయవాడ-గుంటూరేనని క్లారిటీ!

చంద్రబాబు నోట కేపిటల్ మాట: విజయవాడ-గుంటూరేనని క్లారిటీ!
, శనివారం, 16 ఆగస్టు 2014 (13:56 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు రాజధానిపై క్లారిటీ ఇచ్చారు. విజయవాడ-గుంటూరుల మధ్యే రాజధాని నగరం ఏర్పాటు వుంటుందని స్పష్టం చేశారు. కర్నూలులో విలేకరులతో జరిగిన ఇష్టాగోష్టిలో చంద్రబాబు ఏపీ రాజధాని విషయంలో స్పందించారు. రాజధాని అవకాశాలు ప్రకాశం జిల్లా దొనకొండకు ఏ మేరకు ఉన్నాయని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 
 
దొనకొండలో ఖాళీ స్థలాలు తప్ప ఏమి లేవని... రాజధాని అంటే కేవలం గవర్నమెంట్ ఆఫీసులు మాత్రమే ఉండే ప్రదేశమే కాదని... చక్కటి సిటీలైఫ్... మెరుగైన మౌలిక సదుపాయాలు కూడా రాజధానికి ఉండాలన్నారు. 
 
దొనకొండ ఓ మారుమూల ప్రాంతమని... దాని చుట్టుప్రక్కల సరైన నగరం కూడా ఏదీలేదని ఆయన అన్నారు. అలాంటి చోట రాజధాని నిర్మిస్తే ప్లాప్ అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
ఈ విషయాన్ని వివరించడానికి చంద్రబాబు ఓ ఉదాహరణను విలేకరులకు చెప్పారు. మాజీముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సొంత ప్రాంతం మీద ప్రేమతో కడప జిల్లాలోని ఇడుపులపాయ గ్రామంలో ఓ వెటర్నరీ రీసెర్చ్ కేంద్రాన్ని... ఓ ఐఐటి ని నెలకొల్పారని, అయితే... ప్రస్తుతం అక్కడు పని పనిచేయడానికి ఫ్రొపెసర్లు, పరిశోధకులు ముందుకురావట్లేదని చెప్పారు. 
 
అక్కడ సరైన సామాజిక మౌలిక సదుపాయాలు(సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్) లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రస్తుతం అవి అనుకున్నంత ఫలితాలు అందించడం లేదని చంద్రబాబు అన్నారు. 
 
రాజధానిగా విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతమే ఉంటుందని చంద్రబాబు విలేకరులకు స్పష్టం చేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉండడంతో పాటు... మంచి సిటీలైఫ్... మౌలిక సదుపాయాలు ఇప్పటికే బాగా ఉన్నందున విజయవాడ-గుంటూరును రాజధానిగా ఎన్నుకున్నామని చంద్రబాబు తెలిపారు. 
 
రాజధానిని విజయవాడు గుంటూరుల మధ్య ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu