Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగ్లా గదిలో అన్నాచెల్లెలు... అలా వారిని చూసి విస్తుపోయిన డాక్టర్...

నాలుగు రూపాయలు సంపాదించుకునేందుకు విదేశాలకు వెళ్లిన ఓ వైద్య దంపతులకు వారి పిల్లలు చేసిన చేష్టలు తెలుసుకుని విస్తుపోయారు. చదువుల కోసం కొడుకు, కుమార్తెను ఒకే ఇంటిలో ఉంచితే వారు చేసిన పనికి తలదించుకున్నా

Advertiesment
drug addicts
, బుధవారం, 26 జులై 2017 (09:32 IST)
నాలుగు రూపాయలు సంపాదించుకునేందుకు విదేశాలకు వెళ్లిన ఓ వైద్య దంపతులకు వారి పిల్లలు చేసిన చేష్టలు తెలుసుకుని విస్తుపోయారు. చదువుల కోసం కొడుకు, కుమార్తెను ఒకే ఇంటిలో ఉంచితే వారు చేసిన పనికి తలదించుకున్నారు. దీనికి కారణం.. మత్తుదందాల్లో మునిగితేలడమే. 
 
ఏపీ రాజధాని ప్రాంతానికి చెందిన ఓ సంపన్నశ్రేణి కుటుంబానికి చెందిన వైద్య దంపతులకు ఇద్దరు పిల్లలు. దంపతులు ఉద్యోగరీత్యా విదేశాల్లో నివశిస్తున్నారు. కానీ, పిల్లలు మాత్రం విద్యాభ్యాసం కోసం ఇక్కడే వదిలివెళ్లారు. వారికి అన్ని చూసుకునేందుకు పనివాళ్ళను నియమించారు. ఇదే అదునుగా భావించిన ఆ అన్నాచెల్లెలు మత్తుమందుకు బానిసయ్యారు. 
 
ఈ విషయం పనివాళ్ళు విదేశాల్లో ఉన్న దంపతులకు చేరవేశారు. వారు తమకు తెలిసిన ఓ డాక్టర్ ద్వారా వాకబు చేయించారు. ఆ వైద్యుడు ఇంటికెళ్లి చూడగా... వైద్య దంపతుల కుమారుడు ఒక గదిలో మత్తులో జోగుతుంటే, మరో గదిలో వారి కుమార్తె అర్థనగ్నంగా పడివుండటాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని ఆ దంపతులకు చేరవేశాడు డాక్టర్. వెంటనే ఆ దంపతులు విదేశాల నుంచి వచ్చేసి... తమ బిడ్డలకు బెంగళూరులో వైద్యం చేయిస్తున్నారు. 
 
ఇలాంటి సంఘటనలు రాజధాని అమరావతి ఏరియాలో చాలానే జరుగుతున్నాయని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇలాంటి సంపన్న కుటుంబాల పిల్లలంతా కోడ్‌ భాషలతో వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు, నగదు చెల్లింపులకు ప్రత్యేక ఖాతాలతో డ్రగ్స్‌ కొంటున్నట్టు తేల్చారు. రాష్ట్రంలో గత కొంత కాలంగా ఆన్‌లైన్‌ ద్వారా మత్తు పదార్థాలు కొనేవారి సంఖ్య పెరుగుతోందని ఇంటర్‌పోల్‌ నుంచి పోలీసులకు అలర్ట్‌ మెసేజ్‌ వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ బాలికను పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి... గ్యాంగ్ రేప్