Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ మంత్రుల శాఖలు ఖరారు : లోకేష్‌కు ఐటీ - పంచాయతీ రాజ్.. అఖిల ప్రియకు పర్యాటకం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించారు. ఏపీ మంత్రివర్గాన్ని ఆయన ఆదివారం పునర్‌వ్యవస్థీకరించిన విషయం తెల్సిందే. మంత్రివర్గంలోకి కొత్తగా 11 మంది చేరగా, ఐదుగురు మంత్రు

ఏపీ మంత్రుల శాఖలు ఖరారు : లోకేష్‌కు ఐటీ - పంచాయతీ రాజ్.. అఖిల ప్రియకు పర్యాటకం
, సోమవారం, 3 ఏప్రియల్ 2017 (17:24 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించారు. ఏపీ మంత్రివర్గాన్ని ఆయన ఆదివారం పునర్‌వ్యవస్థీకరించిన విషయం తెల్సిందే. మంత్రివర్గంలోకి కొత్తగా 11 మంది చేరగా, ఐదుగురు మంత్రులు తమ పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సోమవారం మంత్రులకు శాఖలను కేటాయించారు. ప్రస్తుతం మంత్రులకు కేటాయింపులతో ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల కేటాయింపులో కూడా కొన్ని మార్పులు కూడా చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. 
 
నారా చంద్రబాబునాయుడు(సీఎం) - సినిమాటోగ్రఫీ, మంత్రులకు కేటాయించగా మిగిలిన శాఖలు
కేఈ కృష్ణమూర్తి (డిప్యూటీ సీఎం) - రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్
నిమ్మకాయల చినరాజప్ప (డిప్యూటీ సీఎం) - హోం, విపత్తు నిర్వహణ
యనమల రామకృష్ణుడు - ఆర్థిక, పన్నుల నిర్వహణ, శాసన సభా వ్యవహారాలు
నారా లోకేశ్ ‌- ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి
కిమిడి కళా వెంకట్రావ్ - విద్యుత్
కింజారపు అచ్చెన్నాయుడు - రవాణా, బీజీ సంక్షేమ, చేనేత
వెంకట సుజయకృష్ణ రంగారావు - గనులు, భూగర్భ
సీ.హెచ్. అయ్యన్నపాత్రుడు - రోడ్లు, భవనాలు
గంటా శ్రీనివాసరావు - మానవ వనరులు (విద్యాశాఖలు)
కోత్తపల్లి జవహార్ - ఎక్సైజ్
పితాని సత్యనారాయణ - కార్మిక, ఉపాధి కల్పన
పైడికొండల మాణిక్యాలరావు - దేవాదాయ
కామినేని శ్రీనివాసరావు - వైద్య, ఆరోగ్య
కొల్లు రవీంద్ర - న్యాయ, స్కిల్ డెవలప్‌మెంట్, క్రీడా, నిరుద్యోగ ప్రయోజనాలు, ప్రవాస సాధికరత, సంబంధాలు
దేవినేని ఉమా మహేశ్వర్ రావు - జలవనరుల శాఖ
నక్క ఆనందబాబు - సాంఘిక, గిరిజన సంక్షేమ
పత్తిపాటి పుల్లారావు - పౌర సరఫరాలు, ధరల నియంత్రణ, వినియోగదారుల వ్యవహారాలు
సిద్దా రాఘవరావు - అటవీ శాఖ
పి.నారాయణ - మున్సిపల్, నగర అభివృద్ధి, నగర గృహనిర్మాణ
సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి - వ్యవసాయం
ఆదినారాయణ రెడ్డి - మార్కెటింగ్‌, గిడ్డంగులు
భూమా అఖిలప్రియ - టూరిజం, తెలుగు భాషాభివృద్ధి, సాంస్కృతికం
కాల్వ శ్రీనివాసులు - సమాచార
పరిటాల సునీత - మహిళా, శిశు సంక్షేమ
అమరనాథ్ రెడ్డి - పరిశ్రమలు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సమ్మర్ సర్‌ప్రైజ్' పేరుతో రిలయన్స్ జియో అద్భుత ఆఫర్... ఒక నెల రీచార్జ్‌తో 2 నెలలు ఫ్రీ