Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెమాల్ తుఫాను ప్రభావం.. ఏపీలో మోస్తరుగా వర్షాలు

Advertiesment
Rains

సెల్వి

, శనివారం, 25 మే 2024 (20:07 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెమాల్ అనే తుపాను తీవ్రరూపం దాల్చిందని, కోస్తా మీదుగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం ఉండదని అధికారులు ప్రకటించారు. 
 
ఈ సాయంత్రానికి రెమాల్ తీవ్ర తుఫానుగా మారుతుందని, మే 26, ఆదివారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా. ఈశాన్య రాష్ట్రాలకు వర్ష ప్రభావం వుంటుంది.
 
ఈ తుఫాను కారణంగా మధ్య బంగాళాఖాతంలో అలలు ఎగసిపడుతుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, చేపల వేటకు దూరంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. తుపాను వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఓడరేవులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభావితం కాకుండా ఉంటుందని భావిస్తున్నప్పటికీ, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళవారం (మే 28) నుంచి ఏపీలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
 
ఇంకా ఉత్తర ఒడిశా, బెంగాల్, మిజోరాం, త్రిపుర, మణిపూర్ వంటి ఇతర ప్రాంతాలకు హెచ్చరికలు రావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంకా, తుఫాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా పురోగమిస్తున్నాయని ఇది కాస్త శ్రీలంకకు చేరుకుందని వాతావరణ శాఖ సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహం లండన్ వెళ్లింది, జూన్ 4న జూలు విదిలిస్తుంది: జగన్ పైన ఎమ్మెల్యే తోపుదుర్తి