Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన రాక్షస కొడుకు

Advertiesment
తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన రాక్షస కొడుకు
, ఆదివారం, 3 మార్చి 2019 (13:24 IST)
ఆస్తిపంచి ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి రాక్షసుడుగా మారిపోయాడు. తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం ఆనంతపురం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాలోని కనేల్ అనే ప్రాంతానికి చెందిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రులను ఆస్తి పంచి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అయితే, అతని మాటలను ఆ తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
దీంతో ఆగ్రహించిన మధుసూదన్ రెడ్డి... తల్లి నరసమ్మ, తండ్రి నారాయణ రెడ్డిలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మంటలకు హాహాకారాలు చేస్తూ తల్లి అక్కడికక్కడే చనిపోయింది. తండ్రి తీవ్రంగా గాయపడి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనను చూసి చుట్టుపక్కలవారు వెంటనే మంటలను ఆర్పి... నారాయయణ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. 
 
ఇకపోతే, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కుటుంబ సభ్యులు మరింత మెరుగైన చికిత్స కోసం బళ్లారి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై నారాయణరెడ్డి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మధుసూదన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్‌లో జమాతే ఆస్తులు సీజ్