Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారా లోకేశ్ మైక్ పట్టుకుంటే.. చంద్రబాబు మొహంలో టెన్షన్ కనిపించింది: అంబటి

వైకాపా నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మంత్రిగా ప్రమోట్ అయిన నారా లోకేష్‌కు సరిగ్గా మాట్లాడటమే రాదంటూ ఎద్దేవా చేశారు. మహానాడులో లోకేష్ మైక్ పట్టుకుంటే ఆయన ఏం మాట్లాడాతారోనని చంద్రబాబు వణికిపోయారని విమర

Advertiesment
Ambati Rambabu
, మంగళవారం, 30 మే 2017 (18:19 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా తలపెట్టిన మహానాడు ఆదివారం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మహానాడులో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ప్రసంగం చేశారు.

అయితే ఇటీవల డాక్టర్ అంబేద్కర్ జయంతిని వర్ధంతి అని పలికి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైన నారాలోకేష్ మహానాడులో మాట్లాడుతుంటే చంద్రబాబు టెన్షన్ పడిపోయారని వార్తలొచ్చాయి. నారో లోకేష్ ఏం మాట్లాడుతారోనని చంద్రబాబు ఆందోళనకు గురైనట్లు సోషల్ మీడియాలోనూ సెటైర్లు వెల్లువెత్తాయి. దీన్నే అదనుగా తీసుకున్న వైకాపా నారా లోకేష్‌ను ఏకిపారేసింది. 
 
ఈ మేరకు హైదరాబాదులో వైకాపా నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మంత్రిగా ప్రమోట్ అయిన నారా లోకేష్‌కు సరిగ్గా మాట్లాడటమే రాదంటూ ఎద్దేవా చేశారు. మహానాడులో లోకేష్ మైక్ పట్టుకుంటే ఆయన ఏం మాట్లాడాతారోనని చంద్రబాబు వణికిపోయారని విమర్శించారు. లోకేష్ సూట్‌కేసులు మోయడానికి మాత్రమే రాజకీయాల్లో వచ్చారన్నారు. 
 
మహానాడులో లోకేశ్‌ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు మొహంలో టెన్షన్‌ కనిపించిందని అంబటి అన్నారు. సరిగ్గా మాట్లాడటమే చేతగాని లోకేష్ తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసరడమా? అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని.. ఆనాడు ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉన్ ఓ పిచ్చోడు.. ఉ.కొరియాపై అణు దాడి చేద్దాం.. అమెరికా - ద.కొరియా కసరత్తు