Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజా పెద్ద తాగుబోతు.. పీకే ఏం పీకుతాడో చూడాలి... ఎవరు?

రాజకీయాల్లో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈమధ్య మరింత రెచ్చిపోయి బూతులు మాట్లాడేసుకుంటున్నారు. వైసిపి ఎమ్మెల్యే రోజా, అధికార తెలుగుదేశం పార్టీ మంత్రుల్లో కొందరైతే మరీ మోసం. వారు ఏం మాట్లాడు

Advertiesment
రోజా పెద్ద తాగుబోతు.. పీకే ఏం పీకుతాడో చూడాలి... ఎవరు?
, గురువారం, 13 జులై 2017 (13:49 IST)
రాజకీయాల్లో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈమధ్య మరింత రెచ్చిపోయి బూతులు మాట్లాడేసుకుంటున్నారు. వైసిపి ఎమ్మెల్యే రోజా, అధికార తెలుగుదేశం పార్టీ మంత్రుల్లో కొందరైతే మరీ మోసం. వారు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. వైసిపి ప్లీనరీలో జగన్ 9 హామీల తరువాత ఒక్కసారిగా టిడిపి మంత్రులు విమర్శలకు దిగారు. జగన్ పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
 
అయితే ఆ తరువాత వైసిపి నేతలు రెండురోజుల వరకు మాట్లాడలేదు. కానీ రోజా రంగంలోకి దిగారు. టిడిపి మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. కేబినెట్ మంత్రుల్లో మందుబాబులే ఎక్కువని, ముందు వారు మద్యం మానితే ఆ తరువాత ప్రజలు బాగుపడతారని చెప్పుకొచ్చారు. ఈ విషయం కాస్త అలా ఇలా పాకింది. చివరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
 
అయితే నిన్న చిత్తూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఎపి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథరెడ్డి రోజాపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రోజా పెద్ద తాగుబోతని, ముందు ఆమె మద్యం మానితే బాగుంటుందని సలహా ఇచ్చారు. దాంతో ఆగలేదు వైసీపీ సలహాదారు ప్రశాంత్ కిశోర్ పైన విమర్శలు గుప్పించారు. ఎవరో పికె అంట ఏం పీకుతాడో తెలియదు... చివరకు వైసిపి జెండాను పీకేస్తాడేమో అన్నారు అమరనాథ రెడ్డి. మంత్రి అమరనాథ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైల్లో శశికళకు రాజభోగాలు.. ప్రత్యేక వంటగది.. జైళ్ల అధికారికి 2 కోట్ల ముడుపులిస్తే శాంక్షన్