Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌కు ఓటమి భయం... 'స్థానికం'కు అమరావతి గ్రామాలు దూరం?

Advertiesment
జగన్‌కు ఓటమి భయం... 'స్థానికం'కు అమరావతి గ్రామాలు దూరం?
, ఆదివారం, 8 మార్చి 2020 (18:08 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నట్టుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను అమరావతి రాజధాని ప్రాంత గ్రామాల్లో నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
నిజానికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ విడుదలైంది. అయితే, రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోరని తెలుస్తోంది. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువస్తుండడం ఓ కారణమైతే, కొన్నిగ్రామాలను ఇతర మున్సిపాలిటీల్లో విలీనం చేస్తుండటం మరో కారణంగా ఉంది. 
 
తుళ్లూరు మండలంలోని గ్రామాలతో పాటు నీరుకొండ, నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాలను కలుపుకుని అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా, మంగళగిరి పురపాలికల్లో బేతపూడి, నవులూరు, యర్రబాలెం గ్రామాలను కలపాలని, తాడేపల్లి మున్సిపాలిటీలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలను కలపాలని ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. 
 
ఈ నేపథ్యంలోనే రాజధాని అమరావతి ప్రాంత గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఓటమి భయం కారణంగానే వైకాపా సర్కారు ఈ తరహా ఆదేశాలను జారీచేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఒకవైపు కామాంధులు మరోవైపు.. విమానంలో నడుము చుట్టూ చెయ్యేసి?