రాజధాని ప్రాంత ప్రజలు చేసే సన్మానం కళ్లారా చూడాలనివుంది...

శుక్రవారం, 10 జనవరి 2020 (11:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులకు జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు ఓ సలహా ఇచ్చారు. ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడటం కాదనీ, దమ్మూధైర్యం ఉంటే ప్రజల మధ్యకెళ్లి మాట్లాడాలని కోరారు. అపుడు ప్రజలు చేసే సన్మానాన్ని కళ్లారా చూడాలని ఉంది అన్నారు. 
 
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత 24 రోజులుగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళనలపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. అయితే, వైకాపా ప్రజాప్రతినిధులు మాత్రం రాజధాని రైతుల ఉద్యమాన్ని కించపరిచేలా వ్యాఖ్యానిస్తున్నారు. 
 
వీటిపై నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. కామెంట్ చేసే ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతానికి వెళ్లి మాట్లాడితే, అప్పుడు అక్కడి ప్రజలు చేసే సన్మానాన్ని తాను చూడాలని అనుకుంటున్నానని అన్నారు. "రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మీ రూమ్స్‌లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే, వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది" అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

 

రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్ యల్ యేలు మీ రూమ్స్ లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతం లో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది.

— Naga Babu Konidela (@NagaBabuOffl) January 10, 2020

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'అమ్మ ఒడి'కి తర్వాత మధ్యాహ్న భోజన పథకం- మెనూలో.. 5 రోజులు ఎగ్ కంపల్సరీ