Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతుల భారీ పాదయాత్ర.. అమరావతి నుంచి అరసవల్లి వరకు..

Advertiesment
amaravati capital
, బుధవారం, 17 ఆగస్టు 2022 (09:35 IST)
అమరావతి రైతులు మరోసారి భారీ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న హైకోర్టు తీర్పునకు కట్టుబడి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న డిమాండ్‌తో సెప్టెంబరు 12 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. 
 
అమరావతిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 60 రోజులకు పైగా కొనసాగనుంది. ఇంకా అమరావతిలో ప్రారంభమై అరసవల్లిలో ముగియనుంది. ఈ రైతుల భారీ పాదయాత్ర పల్లెలు, వివిధ పుణ్యక్షేత్రాల మీదుగా యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం అయ్యింది. వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి.. యాపిల్ తోటలో కశ్మీరీ పండిట్‌పై కాల్పులు, ఒకరు మృతి