నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో తేరుకోలేని షాక్ ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో నవ్యాంధ్రలో రాజధాని నిర్మాణం కోసం దాదాపు 35 వేల ఎకరాలను అమరావతి రీజియన్ రైతులు ఇచ్చారు. వీరికి కేంద్రం ఝలక్ ఇచ్చింది.
ఈ రైతులకు ఆదాయపు పన్ను, మూలధన రాబడి పన్ను మినహాయింపు రాయితీ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో విజ్ఞప్తిచేసింది. కానీ, కేంద్ర మాత్రం ఈ వినతిని తోసిపుచ్చింది. ఇంతకాలంవారివి వ్యవసాయ భూములు. మంచి లక్ష్యంతో వాటిని రాజధానికి ఇచ్చారు. కానీ కేంద్రం మినహాయింపులకు నిరాకరించడంతో ఇకపై వాటి విషయంలో జరిగే లావాదేవీలపై పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే వారు సాగు భూమి కోల్పోవడంతోపాటు పన్ను భారమూ మోయక తప్పని పరిస్థితి అన్న మాట.
కేంద్ర తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సైతం ఏమాత్రం మింగుడుపడటం లేదు. మరోవైపు.. భూములిచ్చిన రైతులను ఏ విధంగా సముదాయించాలో తెలియక టీడీపీ సర్కారు అయోమయంలో పడిపోయింది.