సోషల్ మీడియా పుణ్యమాని నెట్టింట పలు వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ అనుబంధంగా పనిచేసే ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్కు చెందిన నగ్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట కలకలం సృష్టిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక కళాశాల నిర్వాహక భాగస్వామికి అల్లుడు. ప్రస్తుతం ఏలూరు జిల్లా తణుకులో పనిచేస్తున్నారు. కర్నూలులో తనతో పాటు ఓ మహిళా అధికారిని లోబరుచుకుని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆమె ప్రస్తుతం వైజాగ్లో పనిచేస్తోంది. వీరిద్దరూ కలిసి కొంతకాలం జీవనం సాగించినట్లు సమాచారం. ఈమెను మోసగించినట్లు తెలిసింది. దీంతో ఆమె మీడియాను ఆశ్రయించారు. ఈ వ్యవహారం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ మాత్రం ఆమె ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇవన్నీ అసత్యమంటూ చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.