Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పర్యావరణ పరిరక్షణకు అమర రాజా బ్యాటరీస్ కట్టుబడి ఉంది

పర్యావరణ పరిరక్షణకు అమర రాజా బ్యాటరీస్ కట్టుబడి ఉంది
, శనివారం, 1 మే 2021 (19:34 IST)
చిత్తూరు జిల్లాలోని కరకంబాడి, నూనె గుండ్లపల్లిలో స్థాపింపబడ్డ అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్(ఏఆర్బిఎల్) ను మూసి వేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణామండలి నుండి ఏప్రిల్ 30వ తేదీన ఆదేశాలు అందాయి. ఈ మేరకు మండలి ఆదేశాలపై యాజమాన్యం పూర్తి స్థాయిలో సమీక్షించింది. వాటాదారుల ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా అమరాజ గత 35 సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది.
 
దేశ విదేశాలలో అతి కీలకమైన రంగాలైన రక్షణ, వైద్య, టెలికాం విభాగాలలో కంపెనీ ఉత్పత్తులను అందజేస్తూ, వాణిజ్య, సామాజిక, పర్యావరణ సంరక్షణలో ఖచ్చితమైన నియమ, నిబంధనలను పాటిస్తూ సమాజ స్ఫూర్తి దాయక విలువలను సంస్థ ఎల్లప్పుడూ పాటిస్తూ ఉద్యోగుల, సమాజం, వాటాదారుల యొక్క ప్రయోజనాలని పరిరక్షిస్తోంది. కాలుష్య నియంత్రణా మండలి ఆదేశాలపై ఆధారపడి వినియోగదారులు, సరఫరాదారులు, భాగస్వాముల ప్రయోజనాలకు ఆటంకాలు కలగకుండా అమర రాజ బ్యాటరీస్ అన్ని చర్యలు చేపట్టింది.
 
ప్రస్తుత కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మా యొక్క సరఫరాలకు ఎటువంటి అంతరాయం కలిగినా అది తీవ్ర నష్టాన్ని కలుగచేస్తుంది. మండలి ఆదేశాలపై వెంటనే చర్యలు ప్రారంభించింది. కంపెనీ ఆధారిత రంగాలు బ్యాటరీల సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అన్ని మార్గాలను పరిశీలిస్తోంది. కంపెనీ సరఫరా చేస్తున్న ప్రధాన వినియోగదారులకు లోటు కలగకుండా చేయటానికి నియంత్రణా మండలి అధికారులతో చర్చలు సాగిస్తున్నాము. 
 
అనేక సంవత్సరాలుగా వివిధ వార్షిక/ద్వైవార్షిక పర్యావరణ ఆడిట్లు, ధృవపత్రాలు సంస్థ పొంది యున్నది. భద్రత, పర్యావరణ రక్షణలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులను అందుకున్నాము. పర్యావరణం, ఆరోగ్యం, భద్రత యొక్క అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తున్నాము. వాటాదారుల ప్రయోజనానికి నిబద్దతతో వ్యవరిస్తామని కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ సంస్థ యొక్క కార్యక్రమాలు అన్ని సామాజిక, పర్యావరణ సంరక్షణ అనే అంశాల ఆధారంగా ఆచరించబడుతాయి అని తెలియజేసారు.
 
అమర రాజా సంస్థ పర్యావరణ పరిరక్షణ చర్యలు పాటిస్తూ, వివిధ రకాలైన కార్యక్రమాలు, సంస్థ ప్రమాణాలు, చట్ట ప్రకారం చేయవలసిన కార్యక్రమాలు, సంస్థాగతంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలుని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులకి తెలియచేస్తూనే వచ్చింది. సంస్థ యొక్క అందరు వాటాదారులని దృష్టిలో పెట్టుకొని సంతృప్తికరమైన పరిణామం లభిస్తుంది అని ఆశిస్తున్నాము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో లాక్‌డౌన్.. ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందే: సజ్జల