Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

104కి ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలి: స్పందన సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

Advertiesment
104కి ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలి: స్పందన సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌
, మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (14:33 IST)
104 కాల్‌ సెంటర్‌ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలి. ఆస్పత్రికి వెళ్లడమా, క్వారంటైన్‌కు పంపడమా, హోం ఐసొలేషనా? ఏం చేయాలన్నది స్పష్టంగా చెప్పాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

ఇంకా ఆయన స్పందన సమీక్షలో మాట్లాడుతూ.. 104 నెంబర్‌ను మనసా, వాచా, కర్మణా ఓన్‌ చేసుకోవాలి. కోవిడ్‌కు సంబంధించిన అన్ని సమస్యలకు 104 నెంబర్‌ అన్నది వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. ఆ స్థాయిలో కాల్‌ సెంటర్‌ పని చేయాలి. 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలి.

104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలి. జేసీ (గ్రామ వార్డు సచివాలయాలు. అభివృద్ధి) ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలి. ఆ అధికారికి అదే పని ఉండాలి. అప్పుడే మనం అనుకున్న స్థాయిలో సేవలందించగలుగుతాం. మన అధీనంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జేసీ చూడాలి.
 
నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషథాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, హెల్ప్‌ డెస్క్‌లు వాటిలో ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అన్నది ప్రతి రోజూ చూడాలి. జిల్లా స్థాయిలో కోవిడ్‌ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలి. వాటికి ఇంఛార్జ్‌లను నియమించాలి. జిల్లా స్థాయి ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలి. అందులో ఔషధ నియంత్రణ విభాగం అధికారులు కూడా ఉంటారు.
 
అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలి. ఎక్కడ ఖాళీలున్నా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించండి. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయండి.
ప్రజలు ఒకే చోట చేరకుండా చూడాలి. పెళ్లిళ్లలకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి. స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్‌లు, పార్కుల్లో అందరూ ఒకేచోట చేరకుండా చూడాలి అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం జగన్‍కు షాక్... బెయిల్ రద్దవుతుందా?