Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

80 ఏళ్లు సాగిన కేశినేని ట్రావెల్స్‌ని ఒక్క క్షణంలో మూసివేశారా.. లోగుట్టు ఏమిటి?

టీడీపీ ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని ట్రావెల్స్‌ మూసివేత వెనుక పెద్ద మతలబే జరిగిందా? బ్యాంకుల వద్ద నుంచి వందలకోట్ల అప్పు చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి, బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా ఎగనామం పెట్టడం వల్లే చివ

Advertiesment
kesineni travels
హైదరాబాద్ , మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (05:30 IST)
టీడీపీ ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని ట్రావెల్స్‌ మూసివేత వెనుక పెద్ద మతలబే జరిగిందా? బ్యాంకుల వద్ద నుంచి వందలకోట్ల అప్పు చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి, బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా ఎగనామం పెట్టడం వల్లే చివరకు ఆర్థిక భారం తట్టుకోలేక ఉన్నపళంగా మూసేశారా? బస్సుల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులతో విజయవాడలో స్టార్‌ హోటల్‌ కడుతున్నందుకే కేశినేని తన బస్ ట్రావెల్స్‌ రంగం నుంచి పక్కకు వెళుతున్నారా? 
 
 
వైకాపా సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే అధికార పార్టీకి తలెత్తుకోలేని పరిస్థితి తప్పదనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకులనుంచి వందల కోట్లు అప్పు చేసి చెల్లించకుండా ఎగ్గొట్టిన కేశినేని మరో విజయ్ మాల్యా అవతారం ఎత్తారని చెవిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు ఇంతవరకు తెదేపా వర్గాలనుంచి సమాధానం లేదు. కేశినేని బస్సులను ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని చెవిరెడ్డి చేసిన డిమాండుకూ  అధికార పార్టీనుంచి స్పందన లేకపోవడం గమనార్హం.
 
పైగా 2014 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా  కేశినేని నాని దండిగా నిధులు సమకూర్చారు. అంతేకాకుండా టీడీపీ తరఫున ఎంపీగా ఎన్నిక కావడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఈ నేపథ్యంలో నిర్వహణ భారంతో పాటు పోటీ పెరగడంతో నష్టాలు పెరిగాయి. దీంతో సుమారు 80 ఏళ్లుగా నిర్వహిస్తున్న కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయాలని నిర్ణయించారు. 170 కేశినేని ట్రావెల్స్‌ బస్సులను ఇతర ట్రావెల్స్‌ కు అమ్మేశారు. మరోవైపు కేశినేని నాని కార్గో వ్యాపారం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
 
కాగా  శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా కేశినేని ట్రావెల్స్‌ బస్ సర్వీసులను ఆపివేశారు. ఇటీవల రవాణ శాఖ కార్యాలయం వద్ద కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం పట్ల నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు దౌర్జన్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకుని నానితో క్షమాపణలు చెప్పించారు. చంద్రబాబు తనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించడంతో అసంతృప్తిగా ఉన్న నాని అలకబూనారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నతల్లి మళ్లీ పోన్ చేసి ఉంటే ఆ కుమారుడు జీవితానికే దూరం...