Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆనాడు జగన్ మోహన్ రెడ్డికే వార్నింగ్... ఇపుడు రోడ్లపై పిచ్చిదానిలా... ఏమైంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిపోయాక, సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్ నగరాన్ని వీడి వచ్చేందుకు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. చాలామంది ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చుందామన్న ఆలోచనకు కూడా కొందరు వచ్చారనే

Advertiesment
ఆనాడు జగన్ మోహన్ రెడ్డికే వార్నింగ్... ఇపుడు రోడ్లపై పిచ్చిదానిలా... ఏమైంది?
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (16:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిపోయాక, సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్ నగరాన్ని వీడి వచ్చేందుకు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. చాలామంది ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చుందామన్న ఆలోచనకు కూడా కొందరు వచ్చారనే వార్తలు కూడా వినవచ్చాయి. ఐతే అలాంటివారందరికీ భరోసానిస్తూ హైదరాబాద్ నగరం నుంచి అమరావతికి సైకిల్ యాత్ర చేపట్టి ఎందరో ఉద్యోగులకు రోల్ మోడల్‌గా నిలిచారు. ప్రస్తుతం తిరువూరుకి ఏసీటీవోగా పనిచేస్తున్న పద్మ. ఆమె కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు మధ్య జరిగిన వాగ్వాదం సమయంలో ఏకంగా జగన్ మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. సెల్ఫీ తీసి మరీ యూ ట్యూబులో పెట్టేశారు. 
 
ఐతే ఇంతలో ఏమయిందో తెలియదు కానీ ఆమె ఓ పిచ్చిదానిలా రోడ్లపైకి వచ్చేశారు. గురువారం నాడు తిరువూరులోని ఓ సిమెంట్ షాపు వద్దకు వెళ్లి తనిఖీలు చేయాలంటూ హంగామా చేశారు. దానితో సిమెంట్ వ్యాపారి ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా దుర్భాషలాడారు. ఆమె వాలకం చూసి అనుమానం వచ్చిన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దానితో పోలీసులు ఆమె నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది. ఎలాగో ఆమెను అక్కడి నుంచి పోలీసు స్టేషనుకు తరలించి కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తుండగా, అంతలో పద్మ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కొద్దిరోజులుగా పద్మ మానసిక స్థితిని కోల్పోయారనీ, ప్రస్తుతం వైద్య చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఐతే ఎంతో మనోధైర్యంతో ముందుకు దూసుకువెళ్లిన ఈ మహిళ ఇలా మానసిక స్థితిని కోల్పోవడం బాధాకరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివసేన ఎంపీకి చుక్కలు : "గైక్వాడ్ నేమ్ ఫిల్టరింగ్ ఇన్‌స్టాల్" చేసిన ఎయిరిండియా.. టిక్కె క్యాన్సిల్