Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆచార్య యార్లగడ్డ సంపాదకీయ తెలుగు సాహిత్యం- సమాజం, చరిత్ర, ప్రజలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎం

ఆచార్య యార్లగడ్డ సంపాదకీయ తెలుగు సాహిత్యం- సమాజం, చరిత్ర, ప్రజలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎం
, శనివారం, 2 ఏప్రియల్ 2022 (22:52 IST)
మంచి సాహిత్యం సమాజానికి మార్గదర్శిగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కథలు, కవిత్యం, పాటలు ఇలా ఏ మార్గం అయినప్పటికీ సాహిత్యం చరిత్రపై చూపే ప్రభావం గట్టిదన్నారు.

 
ఉగాది వేడుకల నేపధ్యంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న”తెలుగు సాహిత్యం- సమాజం, చరిత్ర, ప్రజలు (రెండు వేల సంవత్సరాలు) ” పేరిట రూపుదిద్దుకున్న పుస్తకాన్ని ముఖ్యమంత్రి దంపతులు జగన్ మోహన్ రెడ్డి, భారతిలు అవిష్కరించారు.

 
ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంకు సమీపంలో నిర్వహిస్తున్న గోశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య యార్లగడ్డతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అలుపెరుగని సాహిత్య సేవను అందిస్తున్నారన్నారు. పుస్తకం గురించి లక్ష్మి ప్రసాద్ వివరిస్తూ 13 మంది గొప్ప కవులతో విరచితమైన సాహిత్యం ఈ పుస్తకంలో అంతర్భాగమై ఉందన్నారు. ఆయా కాలాలలో సాహిత్యం ఇటు సమాజంపై, చరిత్రలో ఏమేరకు ప్రభావం చూపిందన్న విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారం రాత్రి ఆకాశం నుంచి భూమి వైపు దూసుకొచ్చిన మండుతున్న అగ్నిగోళం