Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కావలి వెళ్తున్నా... తిరిగి రావడం ఆలస్యం కావొచ్చు.. ఎదురు చూడొద్దు... ఫ్రెండ్‌తో హరన్న చివరి మాట

నెల్లూరు జిల్లా కావలిలో తన అభిమాని ఇంట జరిగే పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు బుధవారం వేకువజామున 4.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన సినీ నటుడు హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చని

Advertiesment
Aahwanam Hotel Employees
, గురువారం, 30 ఆగస్టు 2018 (12:23 IST)
నెల్లూరు జిల్లా కావలిలో తన అభిమాని ఇంట జరిగే పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు బుధవారం వేకువజామున 4.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన సినీ నటుడు హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈయన మంగళవారం రాత్రి తన స్నేహితుడుతో చివరిసారిగా ఓ మాట చెప్పాడు. 'కావలికి వెళుతున్నాను. తాను తిరిగి రావడం ఆలస్యం కావచ్చని, తన కోసం ఎదురు చూడవద్దు' అని చెప్పారు. ఇపుడు ఆ మాటలే నిజమయ్యాయి.
 
అంతేనా, ఆర్థిక కష్టాల్లో కూరుకున్న తన స్నేహితుడు కోసం తనకు ఎంతో ఇష్టమైన ఆహ్వానం హోటల్‌ను హరికృష్ణ అద్దెకు ఇచ్చారు. అదీ కూడా రెండు నెలల క్రితమే. పలు వ్యాపారాలు చేసి, నష్టపోయిన తన స్నేహితుడు కృష్ణారావును పిలిచిన హరికృష్ణ, ఆయనకు ఆహ్వానం హోటల్‌ను అద్దెకిచ్చి, ఆర్థికంగా కుదురుకోవాలని సూచించారు. స్వయంగా కృష్ణారావును తన ఇంటికి పిలిపించిన హరికృష్ణ, బాధపడవద్దని, పరిస్థితులు సర్దుకుంటాయని ధైర్యం చెప్పారు. ఆహ్వానం హోటల్‌ను నడిపించుకోవాలని సూచించారు. హోటల్ చక్కగా నడుస్తోందని, నీ కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు. ఈ మాటలను హరికృష్ణ స్నేహితుడు కృష్ణారావు బోరున విలపిస్తూ చెబుతున్నారు. 
 
నిజానికి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అబిడ్స్‌లోని ఆహ్వానం హోటల్... రామకృష్ణ థియేటర్లు, హోటల్ కలిసుండే ఈ ప్రాంగణమంటే నందమూరి హరికృష్ణకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆహ్వానం హోటల్ నిర్వహణను హరికృష్ణ స్వయంగా చూసుకునేవారు. ఈ హోటల్‌లో ఆయనకు ప్రత్యేక రూమ్ ఉండేది. హైదరాబాద్‌లో ఉంటే, నిత్యమూ ఇక్కడికి రాకుండా ఉండరాయన. అటువంటి తనకెంతో ఇష్టమైన హోటల్‌ను స్నేహితుడి కోసం త్యాగం చేసిన గొప్ప మనసు హరికృష్ణది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైవేపై 100 కిమీ వేగంతో వెళ్లాలని చెప్పి... ఆయనేమో 160 కిమీ వేగంతో నడిపారు...