Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాతో పడుకుని, సంసారం చేసి ఫ్రెండ్ అంటే ఊర్కోవాలా? ప్రియుడిని కొడుతూ...

Advertiesment
నాతో పడుకుని, సంసారం చేసి ఫ్రెండ్ అంటే ఊర్కోవాలా? ప్రియుడిని కొడుతూ...
, బుధవారం, 24 ఏప్రియల్ 2019 (17:37 IST)
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాతో పడుకుని, సంసారం చేసినవాడు ఇప్పుడు నేను అతడికి కేవలం ఫ్రెండ్ అంటే ఊరుకోవాలా అంటూ ప్రియుడిని చెప్పుతో కొట్టిందో యువతి. ప్రకాశం జిల్లాకు చెందిన అరవింద్‌ను వెతుక్కుంటూ వచ్చిన ప్రియురాలు అతడి ఆచూకి కనుగొంది. అతడిని గట్టిగా పట్టుకుని తనతో వున్న సంబంధం ఏంటంటూ నిలదీసింది. ఆ యువకుడు మాత్రం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెపుతున్నాడు. తమ మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప ఇంకేమీ లేదంటున్నాడు. 
 
డబ్బు తీసుకున్నానంటున్నారు.... అందుకు ప్రూఫ్ ఏమైనా వుందా అని ప్రశ్నిస్తున్నాడు. అతడలా ప్రశ్నిస్తుండగానే ఆమె అతడిని కొడుతూ మీదకు వెళ్లింది. తనను మోసం చేసి ఏమీ ఎరుగనని ఎలా చెపుతున్నావ్ అంటూ ప్రశ్నించింది. తనను ఎందుకు వదిలేసి వచ్చావంటూ నిలదీసింది. తనతో కలిసి కాపురం చేసినవన్నీ వున్నాయని చెప్పింది. 
 
ఇక దీనికి సంబంధించి సహస్ర చెప్పిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లాకు చెందిన అరవింద్‌కు నల్గొండజిల్లా నల్గొండ నగరానికి చెందిన సహస్రకు మధ్య ఫేస్ బుక్ ద్వారా నాలుగున్నరేళ్ళ క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ప్రేమిస్తున్న యువకుడు పెళ్ళి చేసుకుంటాడన్న నమ్మకంతో సర్వస్యం అప్పజెప్పింది. 
 
నాలుగున్నరేళ్ళు ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. అంతేకాదు ప్రియుడిని నమ్మి తన ఆస్తి అమ్మి 45 లక్షల రూపాయలు కూడా ఇచ్చింది. తన తల్లి అనారోగ్యంతో ఉన్నా పట్టించుకోకుండా ప్రియుడు అరవిందే సర్వస్వం అని భావించింది సహస్ర.
 
చివరకు పెళ్ళి చేసుకుంటాడని నమ్మింది. కానీ అరవింద్ మాత్రం పెళ్ళి చేసుకోనని ముఖం మీద చెప్పేశాడు. దీంతో టంగుటూరు పోలీసులను ఆశ్రయించింది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. రాజకీయ ఒత్తిళ్ళలో అరవింద్‌పై కేసు నమోదు చేయలేదు. అరవింద్ ఇంటి ముందు బైఠాయించింది. అతడు తనకు సమాధానం చెప్పేవరకూ కదలనంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్డీ తివారీ కుమారుడి హత్య కేసు: భార్యే హంతకురాలు.. అరెస్ట్ చేసిన పోలీసులు