Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ కొడుకు భవిష్యత్ కోసం నా కోర్కె తీర్చు... హెడ్ మాస్టర్ బాగోతం

మీ అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటా. అందరి పిల్లల కన్నా మీ అబ్బాయి నాకు ప్రత్యేకం. అయితే నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యాలి. నాతో గడపాలి. నా కోర్కె తీర్చాలి. నేను పిలిచినప్పుడల్లా నా గదికి రావాలి. ఇదంతా ఎవరో కాదు చేసింది సాక్షాత్తు ఒక ప్రధానోపా

Advertiesment
school head master
, శుక్రవారం, 27 జులై 2018 (18:17 IST)
మీ అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటా. అందరి పిల్లల కన్నా మీ అబ్బాయి నాకు ప్రత్యేకం. అయితే నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యాలి. నాతో గడపాలి. నా కోర్కె తీర్చాలి. నేను పిలిచినప్పుడల్లా నా గదికి రావాలి. ఇదంతా ఎవరో కాదు చేసింది సాక్షాత్తు ఒక ప్రధానోపాధ్యాయుడే. విద్యార్థులకు విద్యాబుద్ధులను నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడే ఇలా చేయడంతో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. 
 
ఒంగోలు నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో నవీన్ అనే అబ్బాయి విద్యనభ్యసిస్తున్నాడు. పాఠశాలలో ఉన్న స్ట్రెంత్ కన్నా ఎక్కువమంది విద్యార్థులు ఉన్నారు. దీంతో కొంతమంది విద్యార్థులను పంపించేయమని విద్యాశాఖ ఆదేశించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొంతమంది విద్యార్థుల తల్లులను శారీరకంగా అనుభవించేందుకు పన్నాగం పన్నాడు. నవీన్ తల్లిని పాఠశాలకు రమ్మన్నాడు. మీ అబ్బాయిని పంపించేస్తున్నాం. వేరే స్కూలుకు తీసుకెళ్ళండని చెప్పాడు. నవీన్ నిరుపేద కుటుంబం కావడంతో హెడ్ మాస్టర్ ఇలా బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు.
 
కనికరించమని నవీన్ తల్లి ప్రాధేయపడితే నేను చెప్పినట్లు చేస్తే నీ కొడుకును ప్రత్యేకంగా చూసుకుంటాను. ఈ పాఠశాలలోనే అతను చదువుకుంటాడు. భయపడవద్దు... అంటూ చేతులు ఆమెపై వేయబోయాడు. దీంతో ఆ మహిళ ప్రధానోపాధ్యాయుడి చెంప చెళ్లుమనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జరిగిన విషయాన్ని మహిళా సంఘాల దృష్టికి తీసుకెళ్ళింది. మహిళా సంఘాలు నవీన్ తల్లిని వెంటబెట్టుకుని పోలీస్టేషన్‌కు వెళ్ళి హెడ్ మాస్టర్‌పై ఫిర్యాదు చేశారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు ఎయిడ్స్ వుంది... ప్లీజ్ నన్ను కౌగలించుకోరూ... 16 ఏళ్ల అమ్మాయి...