నంద్యాల లోని గిద్దలూరులో దారుణం జరిగింది. కట్టెలు తెచ్చుకునేందుకు ఘాట్ రోడ్డుకి సమీపంలో వున్న వంక వద్దకు వెళ్లిన మెహరున్నీసా అనే మహిళపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
గత కొన్నిరోజులుగా తమ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఐతే చిరుత జాడ కోసం అధికారులు గాలిస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నది. కాగా మెహరున్నీసా గతంలో సర్పంచ్‌గా పనిచేసారు.