రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో 72.24 శాతం పోలింగ్ నమోదు అయింది. మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం 60.54 పోలింగ్ శాతం నమోదయింది.
మిగిలిపోయిన వార్డు స్థానాలకు పట్టణాల్లోను, నగర పంచాయితీల్లోను 68.61 శాతం ఓటింగ్ నమోదైంది.
మున్సిపల్ కార్పొరేషన్‌లో సాధారణ , మిగిలిపోయిన వార్డులకు జరిగిన ఎన్నికల్లో 59.63 శాతం ఓటింగ్ నమోదైంది.
అన్ని విభాగాల్లో మున్సిపల్, కార్పోరేషన్లలో 56 వార్డులకు పోలింగ్ జరుగగా 49.89 శాతం ఓటింగ్ నమోదయింది.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 269 వార్డులకు పోలింగ్ నిర్వహించగా 72.19 శాతం పోలింగ్ నమోదయింది.